పుట:Shathaka-Kavula-Charitramu.pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శతకకవులచరిత్రము

సుమతి యను జైనముని యొకఁడు కలఁడు. "వేమా!" యని “కవిచౌడప్పా!" యని తమకుఁ దాము సంబోధించుకొనుకవులవలె 'సుమతి' యను జైనముని దీనిని రచించియుండు నేమో యని యొకప్పుడు నేను సందేహించితిని. కాని యది సత్యమైనట్లు నిదర్శనమలు లేవు.

ఇట్లు భీమన్న, జైనమునికర్తృత్వము లీసుమతిశతకమునుండి తొలఁగిపోఁగా నిఁక నిది కర్తలేని శతక మనవలసివచ్చుచున్నది. ఇట్లుండఁగా నీ నడుమ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తాము వెలువరించిన నీతిశాస్త్రముక్తావళి (?) లో నీక్రింది పద్యమును బ్రకటించిరి. ఈపద్యమైన వారికి దొరకిన యాగ్రంథము ప్రతు లైదారింట నొకదానియందుమాత్ర ముస్నదఁట. పద్యము వినుడు.

“క. శ్రీవిభుఁడ గర్వితారి
      క్ష్మావరదళనోపలబ్ధ జయలక్ష్మీ సం
      భావితుఁడ సుమతిశతకముఁ
      గావించిన ప్రోడఁ గార్యకమలాసనుఁడ౯"

ఈనీతిశాస్త్ర ముక్తావళియే "నీతిసారముక్తావళి " యని ఇంకొక ప్రతిలోనుంట నిది యాంధ్రపరిశోధక మహామండలివారు ప్రకటించియున్నారు. శ్రీకవిగారిగ్రంథమునందుఁ బ్రకరణవిభాగము లేదు. పాఠములు మాఱియున్నవి. ఆరెండు గ్రంథములు పోల్చిచూచినవారికి వివరములు తెలియఁగలవు. ఈగ్రంథమును వ్రాసినవాఁడు 'బద్దెన' యనుచోడుఁడు. ఇతఁడు నన్నెచోడుఁడని నామాంతరము వాడుకొనెను. ఇదిగాక పెక్కు బిరుదులు కలరాజు, సూర్యవంశజుఁడు, కుమారసంభవము వ్రాసిన నన్నెచోడుఁ డీతఁడుకాడు. అతఁడు శివభక్తుఁడు. ఇతఁడు విష్ణుభక్తుఁడు.

మాకు దొరికిన ప్రతియందు పైరామకృష్ణకవిగారి పద్యము లేదు. కావుననతఁడు సుమతిశతకము వ్రాసెనా? లేదా? యనునది పరిశీలనార్హము. రెండుగ్రంథములను దగ్గఱబెట్టుకొని పరిశీలించినచో భాష