పుట:Shathaka-Kavula-Charitramu.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

శతకకవులచరిత్రము


నకుఁగృతి యిచ్చుచు నందుఁ దనకులమువిషయ మిట్లు చెప్పుకొనెను.

"ధర నుమామాతా పితారుద్రయనఁగ | బరగువేదోక్తి నీశ్వరకులజుండ
 శరణగణాశ్రయసకలస్వరూప | గురులింగవరకరోదరజనితుండ
 భక్తకారుణ్యాభిషిక్తుండఁ బాశ | ముక్తుండఁ గేవలభక్తిగోత్రుండు
 భ్రాజిష్ణుఁడగువిష్ణురామదేవుండు | లేజిష్ణువగు శ్రియాదేవియమ్మయును
 గారవింపఁగ నొప్పుగాదిలిసుతుఁడ ! వీరమహేశ్వరాచారవ్రతుఁడ
 ఖ్యాతిచేసద్భక్తి గలకట్టకూరి | పోతిదేవునిపదాంబుజషట్పదుండ
 సుకృతాత్ముఁ డగుకరస్థలముని శ్వేశు | ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడు
 పడగామురామేశు వరశిష్యుఁ డనఁగఁ | బడుచెన్నరామునిప్రాణసఖుండ
 సంభావితుఁడ భవిజనసమాచరణ! సంభాషణాది సంసర్గ దూరగుఁడ
 నలిబాల్కురికి సోమనాథుఁ డనంగ | వెలసినవాఁడ నిర్మలచరిత్రుండ"
                                                             (బసవపురాణము. పుట 3)

ఇందువలన నీతఁడు శ్రియాదేవి, రామదేవుల పుత్రుఁడనియు, కట్టకూరి పోతిదేవుని భక్తుఁడనియు, వడిగామురామేశుశిష్యుఁ డగు చెన్నరాముని సఖుఁ డనియుఁ దెలియుచున్నది. పండితారాధ్యచరిత్రమునం దిట్లు చెప్పుకొనెను.

"ధర నుమామాతాపితారుద్ర యనఁగ | పరపురాణోక్తి నీశ్వరకులజుండ
 పే రెన్నఁబడిన శ్రీ జెలిదేవ వేమ | 'నారాధ్యులను పరమారాధ్యదేవు
 మనుమనిశిష్యుండ మద్గురులింగ | ఘనకరుణాహస్తగర్భ సంభవుఁడ
 మును బసవపురాణమున నెన్నఁబడిన ! పెనుపారుభక్తుల పెంపుడుకొడుక'
 బసవపురాణప్రబంధ మ౯ పేర | బసవపురాణి య౯ పటిగలవాఁడ
 బసవనిపుత్రుఁడ బసవగోత్రుండ * * *** బసవన్నయిలుబుట్టు బానిసెకొడుక
 * * మసలక మాచెన్నమల్లికార్జునుని | బసవనామం బిడి భక్తి పెక్కు పను* *
 శుద్ధభక్తస్థల శ్రుతిమతాచార ! సిద్ధవీరవ్రత శీలాన్వితుండ
 నలిబాల్కురికి సోమనాథుఁ డనంగ | వెలయువాఁడను చతుర్వేదపారగుఁడ!!

పండితారాధ్యచరిత్రము తనముద్దుమఱఁదియు, నెచ్చెలికాఁడును, సాహిత్యపరుడును, బసవభక్తుఁడును, వీరపోచేశ్వరాచార్యునిశిష్యు