పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ పరిచ్ఛేదము

కం|| శ్రీచరణసరోరుహలా
      క్షాచారువిశాలవక్ష, సంశ్రితజనర
      క్షాచరణదక్ష, దుష్టని
      శాచరకులశిక్ష, శేషశైలాధ్యక్షా !

1. ఉత్తున కచ్చు రా సంధి యగు.

2. అనాది విభక్తి చు వర్ణకంబులందు బహుళంబు.

3. అత్తునకు.

4. కి మాదులం దిత్తునకు.

5. క్రియాపదంబులందు.

6. మధ్యమ పురుషంబునందు నిత్యంబు.

7. అచ్చున కామ్రేడితంబు రాఁ బ్రాయికంబు.

8. విసర్గంబున కనుకరణంబునందు లోపంబు నిత్యంబు,

9. హల్లునకు ద్విర్వచనం బగు.

10. అహమాదులకు బహుళంబు.

11. నమస్సు నత్వంబున కోత్వంబగు,

12. ఉదంత నామంబునకు వు గాగమంబు నిత్యంబు.

13. కుఱు, సిఱు, గడు, నడు, నిడుల ఱ డలకు ద్విరుక్త టకారం బగు.

5