పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబ్దలక్షణ సంగ్రహము

5. ఆద్యప్రకృతికి వర్ణంబు లేఁబది.

6. ద్వితీయంబునకు నలువది.

7. ఇందు ముప్పదియాఱు.

8. అ-ఆ-ఇ-ఈ-ఉ-ఊ-ఎ-ఏ-ఐ-ఒ-ఓ-ఔ-అం-అఁ

కగ చజయుగ టడణ తదన పబమ యరలవ సహ ళంబు లాయవి.

9. ఋ గ్విసర్గ వర్గయు ఙఙ ఞ ఇశషంబులు సమంబులం బొరఐ చొరంబడు.

10. అచ్చులు ప్రాణంబులు.

11. ఎ ఏ ఒ ఓలు వక్రంబులు.

12. ఐ ఔలు వక్రతమంబులు.

13. హల్లులు ప్రాణులు.

14. క చ ట త పలు పరుషంబులు,

15. గ జ డ ద బలు సరళంబులు.

16. లాఁతులు స్థిరంబులు.

17. సకారంబు ద్రుతంబు.

18. చజ లసాంస్కృతికంబులు దంత్యంబులు.

19. ఇ ఈ ఎ ఏలం గూడినవి తాలవ్యంబులు.

20. కొందఱు పదాదిస్వరయోగంబునం దొంటియ ట్లుండు నండ్రు.

2