పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7


ఆ లోపము తీర్చుటకై చాలవఱ కేసూత్రమున కాసూత్ర మర్థబోధకమగునట్లు రచింప సంకల్పించుకొని ప్రథమప్రయత్నముగా నీ శబ్దలక్షణ సంగ్రహమును గొంతకుఁగొంత స్పష్టార్థకములగు తెనుఁగు సూత్రములలోఁ గూర్చియున్నాఁడు.

ఇంతవఱకు నివియన్నియుఁ దాను బ్రకటింపఁదలఁచిన వ్యాకరణస్వరూపము తేలుటకుఁ గావించిన రచనాప్రయత్నములు మాత్రమే. కావుననే యసమగ్రములుగా నిలిచిపోయినవి. తన కభీష్టములగు గుణములతో నప్పటికిని వ్యాకరణ స్వరూపము సిద్ధింపనట్టులెంచి యీ శబ్దలక్షణ సంగ్రహమును దన ప్రధాన వ్యాకరణరచనముగా భావింపక తుదికిఁ దాను భారతాదులనుండి సేకరించిన ప్రయోగజాలమును దాను గూర్చుకొన్న వివిధమగు లక్షణపరికరమును ముందిడుకొని యొక నూతన ప్రణాళిక నిర్ణయించుకొని తదనుగుణముగా సుబోధములగు సూత్రములు, ఆవశ్యకములగు నర్థవివరణములు, అనురూపములగు లక్ష్యములు మున్నగువానితో బాలవ్యాకరణమును సంతరించి తన యభీష్టముల కనురూపమగు నొక వ్యాకృతి యాకృతిఁగాంచెనని సంతృప్తి నందెను. నాఁటినుండి నేఁటివఱకు నది యొక్కటియే ప్రమాణమగు నాంధ్రలక్షణ గ్రంథముగా దేశమంతట నుపయుక్తమగుచున్నది. ఇది చిన్నయసూరి వ్యాకృతులఁగూర్చి స్థూలముగా నొనర్చిన పర్యవేక్షణము సూత్రమే

కాఁగా నీ శబ్దలక్షణసంగ్రహము ప్రస్తుతము ప్రచారములో నున్న బాలవ్యాకరణమునకుఁ గల పూర్వ రూపములలో