ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

75

తా. ఆగమవిదులు నిన్నే సరస్వతి లక్ష్మి పార్వతి యనియెదరు. ఈమువ్వురికంటె వేఱైన పరబ్రహ్మరూపుఁడగు సదాశివునిదేవివగు చంద్రకళయని వాడఁబడు శ్రీవిద్య యగునీవు మహామాయవై ఊహింపనలవికాని దేశకాల వస్తువులచే పరిచ్ఛేదింపరాని మహిమగలదానవై వెలయుదువు. తెలిసినవారలు ఒకనిన్నే యిన్ని పేరులతో వాడుదురుగాని నీవెప్పుడును ఒక్కదానవే.

కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్,
ప్రకృత్యా మూకానామపిచ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమలతామ్బూలరసతామ్. 98

టీ. హేమాతః = ఓయమ్మా, విద్యార్థీ = బ్రహ్మజ్ఞానమునభిలషించునేను, కలితాలక్తకరసం-కలిత = కలుపఁబడిన, అలక్తకరసం = లత్తుకద్రవముగల, తవ = నీయొక్క, చరణనిర్ణేజనజలం = కాళ్లుగడిగిన నీటిని, కదాకాలే = ఎప్పుడు, పిబేయం = త్రాగుదును. (తత్ = అది,) ప్రకృత్యా = స్వభావముననే, మూకానామపిచ = పలుకుటకు వినుటకుఁ దెలియనివారికిఁగూడ, కవితాకారణతయా = కవనమునకు హేతువగుటచేత, వాణీముఖకమలతామ్బూలరసతాం-వాణీ = సరస్వతియొక్క, ముఖకమల = మోముదమ్మియందలి, తామ్బూల = తమ్ములముయొక్క, రసతాం = సారస్యమును, కదా = ఎప్పుడు, ధత్తే = స్వీకరించునో.

తా. తల్లీ, బ్రహ్మజ్ఞానమును గోరుచున్న నేను లత్తుకచే నెఱ్ఱనైననీపాదోదకమును ఎప్పుడు క్రోలుదునో, కవనహేతువు గనుక అది సరస్వతీ దేవియొక్క తామ్బూలరసముయొక్క సొంపుగల దెప్పు డగునో.

అవ. మొదలిడిన స్తోత్రమును ముగించుచు షట్కమలభేద సిద్ధాంతమును జెప్పుచున్నారు:-

సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే
రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా,