ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

17


సమస్తమగు, ఉర్వీం = భూమిని, అరుణిమనిమగ్నాం-అరుణిమ = ఎఱుపులో, నిమగ్నా = మునిఁగినదానిఁగా, యః = ఎవఁడు, స్మరతి = ధ్యానించునో, అస్య = వీనికి, త్రస్యద్వనహరిణశాలీననయనాః-త్రస్యత్ = బెదరుచున్న, వనహరిణ = అడవిలేళ్లకువలె, శాలీన = అందములైన, నయనాః = కన్నులుగల, గీర్వాణవనితాః = అచ్చరలు, ఊర్వశ్యా సహ = ఊర్వశితోఁగూడ, కతికతి = ఎందఱెందఱు, వశ్యాః = లోఁబడినవారలు, న భవన్తి = కారు, అందఱును వశంపద లగుదురనుట.

తా. తల్లీ ఎవఁ డీమిన్నును మన్నునుగూడ నీయొక్క మేనిరంగులచే నెఱ్ఱనైనదానినిగా భావించునో యట్టివానికి ఊర్వశితోఁగూడ ఎందఱెందఱు చకితహరిణీనేత్ర లగునచ్చరమచ్చకంటులు వశముగారు? ఎల్లరు నగుదురు.

శ్లో. ముఖం బిన్దుం కృత్వా కుచయుగమధస్తస్య తదధో
    హరార్ధం ధ్యాయేద్యో హరమహిషి తే మన్మథకలామ్,
    న సద్యస్సఙ్క్షోభం నయతి వనితా ఇత్యతిలఘు
    త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీన్దుస్తనయుగామ్. 19

టీ. హరమహిషి = శివునిపట్టపురాణివగు వోతల్లీ, ముఖమ్ = మొగమును, బిన్దుం = బిందురూపమును, కృత్వా = చేసి, తస్య = దానికి, అధః = క్రింద, కుచయుగం = చంటిజంటను, కృత్వా = చేసి, తదధః = దానిక్రింద, హరార్ధం = శక్తిరూపమును (త్రికోణమును), కృత్వా = ఉంచి, తత్ర = అచ్చట, తే = నీయొక్క, మన్మధకలాం = కామబీజమును, యః = ఎవఁడు, ధ్యాయేత్ = ధ్యానించునో, సః = ఆయుపాసకుఁడు, సద్యః = అప్పుడే, వనితా = జవ్వనులను, సంక్షోభం = కలవరమును, నయతీతియత్ = పొందించుననుట యేదికలదో, తత్ = అది, అతిలఘు = మిగులస్వల్పము, రవీన్దుస్తనయుగాం-రవీన్దు = సూర్యచంద్రులే, స్తనయుగాం = కుచద్వయముగాఁగల, త్రిలోకమపి = ముల్లోకములను, ఆశు = శీఘ్రముగా, భ్రమయతి = మోహపెట్టుచున్నాఁడు.

తా. తల్లీ, ముఖమును బిందువునుగాఁ దలఁచి, దానిక్రింద పాలిండ్లను కల్పించి, యాక్రింద త్రికోణమును ధ్యానించి యచట నీమదనబీజము