ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

7

అవ. మన్మథునకు దేవీప్రసాదమునఁ గలిగినమహిమను జెప్పి దీనిలో నాతఁ డనంగవిద్యలో మన్మథప్రస్తారమునకు ఋషియౌటచేఁ గలిగిననేర్పరితనమును జెప్పుచున్నారు.-

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పఞ్చ విశిఖా
వసన్తస్సామన్తో మలయమరుదాయోధనరథః,
తథావ్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపా
మపాఙ్గ్తాతే లబ్ధ్వా జగదిదమనఙ్గో విజయతే. 6

టీ. హిమగిరిసుతే = పార్వతీ, ధనుః = విల్లు, పౌష్పం = పూవులచేఁ జేయఁబడినది, మౌర్వీ-అల్లెత్రాఁడు, మధుకరమయీ = తేంట్లచేఁజేయఁబడినది, విశిఖాః = తూఁపులు, పఞ్చ = అయిదు, సామంతః = సచివుఁడు, వసంతః = వసంతకాలము, మలయమరుత్ = దక్షిణపుగాలి, అయోధనరథః = యుద్ధరథము, తథాపి = ఆలాగైనను, అనఙ్గః = మన్మథుఁడు, ఏకః =ఒక్కఁడే, తే = నీయొక్క, అపాంగాత్ = క్రేగన్నువలన, కామపి = చెప్పనలవిగాని, కృపాం = దయను, లబ్ధ్వా = పొంది, ఇదం = ఈ, జగత్ = లోకమును, సర్వం = అంతను, విజయతే = జయించుచున్నాఁడు.

తా. తల్లీ, విల్లా పూవులు (మృదువులౌటవలన తాఁకినఁ గందిపోవునవి గాన వంచుటకుగాని లాగుటకుగాని వీలుగానివనుట), అల్లెత్రాడు తుమ్మెదలు (ఒకటికొకటి పొందిక లేనందున త్రాడగుటకుఁ దగవనుట), అయిదు బాణములు (అవి ఖర్చుపడిన నిఁకగతిలేదనుట అవియును పూవులు గనుక బాణములుగాఁ దగవు). వసంతర్తువు సహాయము (అచేతనమగు కాలము మంత్రియగుటకుఁ దగదు). మలయమారుతము యుద్ధమునందలిరథము (ఇది యెప్పుడు నుండదు ఉన్నప్పుడేని స్థిరముగాదు అయినను రూపములేదు), ఇట్టి పనికిమాలిన పరికరములుగలిగియు మన్మథుఁ డేకవీరుఁడై నీదయతోడికటాక్షములఁ బ్రబలి ముల్లోకములను నేలకుఁ గోలకుఁ దెచ్చుచున్నాఁడు.