ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

ప్రథమాంకము

నాంది

మ|| ననవిల్తుండు చలంబునన్ బయిఁబయి న్మాతంగకన్యాదిలో

కనసమ్మోహనబాణ మేసినను, నక్ష్రతేశుఁడా మీఁదఁ జి

క్కని రేయెండల గుప్పుచున్నను, దదేకధ్యానవిన్యస్తచిం

తన మై మాఱని రాజశేఖరుతపో నైశ్చల్య మేలున్ మమున్.

గీ|| భువనకారణ మీశ్వరు, మూర్తి యేది

ఆస్తికనిరూఢి కెయ్యది యాదిమూల

మఖిలధర్మంబులకు నేది యాటపట్టు

అట్టి సత్యంబె యందఱ నాశ్రయించు.