పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

శ తో వధా న సారము పూ ర్వార్థ ము •


గాంచె||8|| వ॥ అయ్యెడ. సీ|| లోళలోకారాధ్యు నేకామ్రనాథుని సేవించి కామాక్షిఁ జిత్తగించి | యష్టోత్తర శతాలయముల నీక్షించి యట దేవత లకెల్ల నంబలి యిడి | సర్వతీర్థ మునుము స్నానము గావించి కడు వేగమున విష్ణుకంచి కరిగి వరదరాజస్వామి చరణములకుమ్రొక్కి యల్ల పేరిందేవి కంజలి గొని|| తేట|గీ|| (పంచపాది) బ్రహతీర్థ ము నందునఁ బరమభక్తి , దాన మాడి నృసింహతీర్థమునందు! నట్లన యొనర్చి త్రోవలో నధిక భక్తి, క్షీరనది వేగవతి బాహు సింధువు మెగి,గలయు నెడఁ దాస మాడే నాక్ష్మా వరుండు ||6| క|| తరువాత నాలజా బాక్పురమున డిగి పక్షి తీర్తమునకేగెను. బా, లుంబ్రోవను గడు రయమున, బురోహి తాపత్య బంధుముఖ్యుల తోడన్||10| వ|| అయ్యెడ వేదగిరీశ్వరుని సేవించి నాగమాంబను గొని యూడీ త్రిపురసుందరీభక్త వత్స లేశ్వరచరణారణారవిందములకుఁ బ్రణమిల్లి బలివిధ్య సంతరమున నర్చకునికరమునఁ జాలు వారు ప్రసాదమ్మును నిర్భయ మ్ముగ భక్షించి పోవుపక్షీయుగ ము నీక్షించి యట నుండి చెంగల్పట్టు పురి కరిగి మధురాంతక ముం గడచి తిందివనం బతిక్రమించి విళు పురంబు దాఁటి పండ్రెండు గ్రామం బధిగమించి, క్రొత్త పాళెముఁ జేరం జని, ||11|| శ॥ గరుడనదిలోనఁ గ్రుంకిడి, తిరుపావూరికినిఁజనియు స్థిరతరభక్తిబ్ గురు పాట లేశ్వరునిఁ గని, తిరువిందపురము భూమతిలకుఁడు చనియెన్ |12||, సీ:దేవ నాథస్వామి పావనాంఘ్రులు మొక్కి, యలశంగమల తాయి కం జలి యిడి | సంజీవిపర్వతసందర్శనము చేసి కొత్త సత్రములోనఁ గొలువు దీర్చి! తరువాతను మణి ముక్తానదిలోఁ గ్రుంకి పదఁపడి యలచిదంబరము జేరి | యటఁ జిదంబర దేవు నాసక్తిఁ గొనియాకి కామసుందరికృపాకలన వడసి తేజ చిత్కనక దేవసభలను జిత్తగించి, రాజనాట్య సదస్సులకంగు చూచి! తత్సభౌ నాయక స్వామిఁ దనియఁ జేసి యాశుగ తిమీరి రాజు చియ్యాళి జేరె.|13 ||వ! అచ్చట మంగళాంబాచరణమ్ములకు మొక్కి ఉష్ణువు త్రవిక్రమనాథస్వామి పాదముల కెఱిఁగి కొండమీఁద నుండుచట్ట నాథస్వామికిని నుమామహేశ్వరస్వామికినిఁ బార్వతికిని నమస్కరించి దిగువనుండు బ్రహ్మపురీశ్వర త్రిపుర సుందరీ దారవిందమ్ములు డెందమునఁ బొంగువరచియారాజపురందరుండు, గార, తే.గీ|| వైద్య నాథమ్మునకుఁ జని