పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంకటగిరి

33

33


బందరు 'మొదలగు పట్టణముల లోని యవధానములలో నాకా శపురాణములు చెప్పఁబడినవి. కాని గ్రంథవిస్తర భీతి చే నవియన్ని యును వదలి యీయవధానమునఁ జెప్పిన యాకాశపురాణగాథ యించుక రమ్య మని యిందుదాహరించుచున్నాము. ఇయ్యది శ్రీ వేంకటగిరి రాజావారి రామేశ్వర ప్రయాణమును దెల్పెడి . . .

ఆకాశపురాణము- రామేశ్వరయాత్ర.

శ్లో॥ కించి దాశాస్మహే తేజ స్సర్వలోక శుభప్రదం | యత్కృపావ శతో లోకే సర్వకార్య జయో భవేత్ || ౧ || న || అభ్యుదయపరంపరాభివృ ద్ధిగా మారచింపఁ బూను రామేశ్వరయాత్రకుఁ గథాక్రమం బెట్టిదనినః |2|

క|| సురపురము మించి ధనదుని , పురమున్ వెళిఁ బెట్టి సర్వపుర రాజంబై , ధరణిఁ జాలువారు వేంకటగిరి యను సుక పురవరంబు కీర్తి కిఁ దావై || 3|| న!! అప్పురమ్మన కధీశ్వరుండగు శ్రీరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమారయాచేం ద్రభూపాలుండు. 4|| క|| నలవత్సర కార్తి కికబ, హులపంచమి సోమవార మొప్పుగ యాత్రా | కలనాదర మఱి ముఱగ బయలు వెడ లెను భటపురో హితామాత్యులతోన్| 5|| వ|| ఇట్లు శుభోదర్కమ్ముగ 'బయలు వెడలి యాదినమం దత్తి వరమ్మును మరునాడు నాయఁడు పేటయును జని యం దొక్క నాఁడు వసించి పిమ్మటఁ బోలూరి కరిగి రెండుదినము లచ్చట నుండి, పదంపడి హరివాసరంబునకు నారం బాకసత్రమ్మునకు వేంచేసి యం దుప పావసించి మరు నాఁ డుదయమ్మునకు గుమ్మ డిపూడిసత్రమున కరిగి యందు ద్వాదశీవ్రతాచరణం బాచరించి యనంతరంబు! 6! క|| వెంగళు నామక మగుమారం గలనే రేళ్ల రాజరత్న విభుని చేతం గడుబూజింపంబడి... ముం గలఁదిరువళ్లూరికి మునుకొనిచనియెన్ || 7l వ|| అచ్చట. సీ॥: తత్పుర వాసుఁ డై తనరారు వీరరాఘవదేవునకును దత్కాంత యైన , చుళుకృత్త నాంచారి కలఘు భక్తిని మొక్కి భోగాదికంబులఁ బొలుపు మీఱ/ జేయించి యట సుఖ శ్రీయుక్తి, నారోజు గడపి యు ధూమశకటము నెక్కి | మరునాఁడు ప్రొద్దుట సురగి కంపెనీపేట యటనుండి నాగెడాఖ్య పురమేగి! | తే.గీ|| పై నిఁ ది గుమాళ్ల పూ రేగి పరమభక్తి , దేవ దేవుని మణికంటదేవు మ్రొక్కి, పేర్మి నా దేవు మెచ్చించి నితతపుణ్య |రాసులకు సంచి శివకంచి రాజు