పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

శ తావ ధా న సారము, పూర్వార్థ ము .


సీసము -- ప్రకృతకవుల గురువు

ఏమహాపండితుం డీమహి ధవళేశ్వరం బనునూ సత్రం నెట్టె
నేమహాపండితుం డెంతయు వైయాకరణశిరోమణి యస గణన "కెక్కె-
నేమహాపండితుండీమమ్మునఇ ఉణు "మొదలు భాష్యము దాఁకఁజ దువఁజే సె
నేమ హాపండితుం డెందఱినో నోపుట్టు బ్రహ్మచారుల గృహపతులఁ జేసె,
తే!{గీ॥ నట్టిచర్లాభిధానాన్య యాబ్ది చంద్రు
సకలగుణధుర్యు, బ్రహ్మయ్య ,సాస్త్రి వర్యు
ద్రివిధమత నేది సకల సదీతి నాది
నమితశాంతుని మద్గురును సభినుతింతు10

.............................................................................................

పైరీతని చెప్పగా మేమీపట్టణమున నాలుగైదుచోట్ల ప్రత్యక్షముగా కని వినియు న్నాము. వీరిక్కడ జెప్పినశ్లోకములు కొన్ని యిందు వ్రాయుచున్నాము. . . అష్టావధానమనఁగా నేక కాలమం దెనిమిని పనులయందు దృష్టి నిల్పుట, దీనినిగూర్చి యీ కవులే. యీ క్రింది పద్యమును వ్రాసియున్నారు. .. . . ఇది యూపట్టణమునఁ " గొందఱాంగ్లేయ స్త్రీ పురుషుల (European ladies and gentlemen) యెదుట గూడనొనర్చి మెప్పునొందినారు వ్యక్తాక్షరి అనఁగా యేభాషలో నైనను ఒక వచనములోనివి కాని పద్యములోనివి కాని మాటలను సం ఖ్యులు వేసి వరుస వెంబడిని గా కుండ చెల్లా చెదురు గా ఒక్కొక్క మాటకు దాని క్రమమయిన సంఖ్య సహితము కాగిత పుముక్కల మీద వ్రాసి వీరు అష్టావధానము చేయుచున్న సమయ ములో నప్పుడప్పుడిచ్చుచు రాగాఁ జివరకు నాయా మాటలను తిన్నగా కూర్చియొప్ప గించుట, ఈపట్టణఘు (1) యిస్, వైజ్ , నిష్క్', వాస్, సోల్ , రెస్, విజ యి టెస్టు, డాస్, యిష్; యిష్, సో, ట్రసరిష్, బిస్', అయెక్, మె క, మౌస్, యెరైక్, లైటెక్, డాస్, కంప్ట్, నూర్ . హౌస్, డెస్, అనుజర్మనీ భాషయు, (2) యమం, తత, సిడౌడ్, తతస్మా, న్మమాయా, కశి, 'నోగోసార్, మదరాసు, కాయగ రితం, హి గెందు, బాయేంచనం, నింగత్పూరయ, నింగకూడ, వితు, దల్ , నీవాడ' నంటింగదా,కిస్వాస్తేమయి బోల్తాహుం, ఆజి, సునో, తక్సీర్ , స, మోరే, ఉపర్ , అని నానాషలలోని మాటలతోఁ గూర్పఁబడి మిసలేని యస్ బలే శ్లోకమ్ అని నామధేయమీదగిన శార్టూలవిక్రీడిత రూపక శ్లోకమును (3) హిం దూహైస్కూలులో ప్రధాన సహోపాధ్యాయులగు బ్రహ్మశ్రీ ముత్తు అయ్యరుగారు వీరి శక్తి నర్జునుని బాణవర్షముతోఁబోల్చి వర్ణిం-చుచు నూతనముగా రచించిన "అష్టా వదానిగళ్ శెయ్యనల్లే మెన్ డ్రవైపుహుందు | తట్టామ లే శిలర్ తత్తళిప్పార్ విల్లితన్ శిరంబోల్ : ఎట్టేపుహుడ్రు పిన్నె ట్టెట్టెట్టెటిట్టింగివరైయుప్పు |ముట్టాదు శెయ్యశెయ్యనల్లారి ల్లై యేయింద మొయిణిలత్తే" అను ద్రావిడ భాషా శ్లోకమును వ్యస్తాక్షరి కొఱకుపయో