పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/131

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ 'తా వ ధా న సారము, ఉత్త రార్థము,

119


తేట|గీ||కవులు నుతియింపఁదగిన లక్షణము లొప్ప
నేఁటిసభ నెంతయేనియు నీటుమెఱసె
నలరు కోవెలమూడి వంశామ్రమునకు
గోవెలయెనాగ రామయ కుతుకమలర,3

ప్రకృత హిందూ దేశస్థితి.

ఉ|| భూపతులందు రాజ్యమున బొత్తిగ భక్తి నశింపజొచ్చె లో
లోపల రాజు లెల్ల రకు లోచన యెక్కువ కాదొడంగె లో
కావకృతుల్ పొసర్పఁదగునట్టికు హూణు” లటంచు నెల్లచో
వ్యాపకమయ్యే నీపయిని నచ్చెడిచిత్రము. లెట్టివో గదా.4

కనక దుర్గ .

మ|| ఘనమైయె ప్పెడి యింద్రకీలమును వేడ్కల్ మీఱగా గాపురం
బునుజేయన్ దొరకొన్న దేవి చరణాం భోజూతమత్త ద్విరే
ఫనికాయాయితసర్వదేవ నిచయ ప్రస్తుత్య చరిత్ర చ
క్కనిమా యమ్మ కృపాబ్ధి యో కనకదుర్గా? మమ్మురక్షింపుమా,

సువర్ణ ముఖ, కాళహస్తీ శ్వరుఁడు.

సీ|| ఏనదీజలము నొక్కిం తేని గ్రోలిసఁ బతితు లెల్లరును బావనతగాంత్రు
ఏదేవుపాదంబు లెం తేని సేవించి తిన్నండు భక్తి సందీప్తుఁడయ్యె!!
స్నానంబు నెనసి బోగవుఁగన్నె లిరువురు ముక్తి కిఁ దెఱవులై రి ఏ దేవుమ
హిమంబు నెఱిఁగి తావ్యాళంబు మునులు గాంచఁగ లేని మోదమందె,

తేట గీ||అట్టినది యట్టి దేవుఁడు నట్టి దేవి
యట్టిపట్టణమును భువియం దేకాదు
స్వర్గపాతాళములనేని దుర్గమంబు
కావుననె దాని దక్షిణకాశి" యండ్రు.5