ఈ పుటను అచ్చుదిద్దలేదు

సర్వే గణిత చంద్రిక.

దైర్ఘ్యమానము

1 వ సూత్రము.

సీ. తలవెండ్రుకలను వెడలుపుగా నెన్నిరి
    నిలుపఁగా విషువగుఁ గొలతకొఱకు
నట్టి వష్వాష్టకంబైనఁ గాష్ఠంబగుఁ
గాష్టాష్టకము యవగర్భ మగును
యవగర్భములు దచ్చియైన నంగుళమగు
నంగుళాల్ ద్వాదశాలైన నడుగు
అడుగులు మూఁడైన నగు గజం బట్టి యి
ర్వదిరెండు గజములఁ బరఁగు గొలుసు

8 తలవెండ్రుకల వెడల్పు = 1 విషువు.

నిలుపఁగా

8 విషువులు = 1 కాష్టము.

8 కాష్టములు = 1 యవగర్భము.

8 యవగర్భములు = 1 అంగుళము.