పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంగము

కై:- నేనుదేవదేవుని ప్రార్దించు చుందును. ఇంక కాలవిళంబమగుచున్నది. సుఖంగనుండుము.

తార:- అయ్యే! ఈన్యాయస్ధానములో న్యాయమే లేదే!

శ్రీధర:-పిచ్చితారా! బయట మాత్రము న్యాయమున్నదా? సమాజమున ప్రకృతము నిజమైన ధర్మములేదు. సమాజము లోని అంతర్భాగమైన న్యాయస్ధానమున నిజమయిన న్యాయములేదు.

న్యాయా:-అమ్మా! తారాదేవి! ఇంకమీరు సంబాషణ ముగింపుడు.జరుగతగిన కార్యములున్నవి.

తార:-(దు:ఖించుచు తనస్థానమునకుబోవును)

న్యాయా:- శాస్త్రిగారు! మీపైన ఇండియన్ పీనల్ కోడు శక్షను 380 లేక 411 మేరకు చార్జుచేయబడియున్నది. మీరట్టినేరము చేసితిరా?

శ్రీధర:-లేదు.

న్యాయా:-ఫిర్యాదిపరము సాక్షులను మరల సవాలుచేయుటకు మీకు అవకాశము రేపటివరకు గడువిచ్చియున్నాను.

శ్రీధర:-అయ్యా! నాకేగడువునక్కరలేదు. నేనడుగ వలసిన ప్రశ్న ఏదియులేదు. నాకు సాక్షులక్కరును లేరు. నాసాక్షి జగస్సాక్షియే....

(అప్పుడు రాజారావు తొందరగా ప్రవేశించి జేబులోనుంచి చంద్రహారమొక్కటితీసి మేస్ట్రీటుగారి మేజాపైనుంచి)

రాజా:-మేజస్ట్రీటుగారు! అదియే వీరణ్ణశెట్టిగారియింట దొంగిలింపబడిన వస్తువు. దీని విషయము నేను సవిస్తరముగా చెప్పెదను. అయిన నాసాక్షిత్వము మీరు బహిరేంగముగా కాక మీగదిలోనే వినవలెను. యదార్దము చెప్పెదను. శ్రీధరశాస్త్రి నిరపరాధి

న్యాయా:-భీమసేనరావుగారు! ఇదిఏమి మీకుమారునిది వింత చర్యగానున్నదే?