పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/76

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


విద్యా:--అవునండీ "ప్రమాదోధీమతామపి" (అన్నాడు)

న్యాయ:--మరిచెప్పండి. మీకెట్లుతెలిసినది. వీరణ్ణ శెట్టిగారి పదకమని?

విద్యా:--(ఇటునటుచూచుచు) దానిపైన వెనుకబాగమున "ళ" అను అక్షరము వ్రాయబడియున్నదండి.

న్యాయా:--(ఆపదకము తీసిచూచి) ఆచార్యులవారూ! మీకు ఇంగ్లీషు చదువను తెలియునా/

విద్యా:--అయ్యయ్యో! వైదికబ్రాహ్మణడవే. మీతండ్రిగారికి నాపైన ఎంతభక్తి, విశ్వాసము.

న్యాయా:--ఆచార్యులవారూ! నాకుగూడ మీపైన భక్తి విశ్వాసము పుట్టుచున్నది. చెప్పండి. ఈఇంగ్లీషు అక్షరములనెట్లు జదివితిరి?

విద్యా:--హెడ్డుకాస్టేబిల్ గారు జదివిచెప్పిరండీ. పోలీసువారికేమెపట్టిందండీ తప్పు కేసు పెట్టడానికి? ఈ కేసు నిజమండి. ఈ కేసు నిజమండి.

న్యాయా:--నాకును అట్లేతోచుచున్నదండీ. ఆ. ముందుచెప్పండి.

విద్యా:--ధర్మప్రభువులు! జ్ఞానమండి-జ్ఙానము. పంచనామా జరిగినది. శెట్టిగారిని పిలిపించిరి.వారీపధకము తమదేయని గుర్తుపట్టిరి. పిదప శ్రీధరశాస్త్రిని దస్తుగీరుచేసిరి. అయితే ఒక్కమాట-ఎంతచెడిన బ్రాహ్మనుడండీ!

ప్రా-ఇన్;-- ఇదేనా పంచనామా?

విద్యా:--(చూచి) అవునండి నేను రుజువుచేసినాను.

న్యాయా:--(పంచనామాతీసుకొని చదివి) ఏమండీ ఆచార్లువారూ! దీనిలో ఈపదకం పైకుండలో దొరీనట్లు వ్రాసినదే?

విద్యా:--నేనెక్కడైనను అబద్ధం చెప్పుతానండీ? పోలీసువారి పొరపాటుగా వుండవచ్చునండీ.

న్యాయా:--(ప్రాసిక్యూటింగు ఇన్ స్పెక్టరు కూర్చున్న తరువాత శ్రీధరునివంక చూచి) మీరేమైన అడిగెదరా?