పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/73

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంగము


ప్రా-ఇన్;- వీరు నౌకరీ ఎక్కడచేయుచుండిరి?

విద్యా:- హాలీ ఈనేరముజరిగినప్పుడు రాజా వీరణ్ణశెట్టి గారివద్ద గుమాస్తాగయుండిరి. అంతకుముందు మన రావుబహద్దూరు వకీలు భీమసేవరావుగారివద్ద నౌకరీచేయుచుండిరి. మంచివారే అయితే ఏదో కొంచము చెయ్యిగుణము భద్రములేదని......

న్యాయాధి:-షట్ అప్, ఆచార్లుగారూ! ఖైదీగుణవర్ణన మీరుచేయనవుస్దరములేదు.

విద్యా:-ఆజ్ఞ, మహాస్వామి! నిజమే ఒక్కరి గుణచర్ణన మన కెందుకు "యేనకేనావ్యూఅయేనప్రేసిద్ధపురుషోభచ్వ" జ్ఞానము కావలెనండి. జ్ఞానము.

న్యాయాధి:-జ్ఞానముకంటె ముందుగ మీకు మౌనముగావలె ఇచ్చట. అడిగినప్రశ్నకు బదులుచెప్పడు.

ప్రా-ఇన్:-మీరు మొన్న పదునాలుగతేదీ శనివారమునాడు ఉదయము వారియింటికి పోయియుంటిరా?

విద్యా:- ఇట్లనే, పొవలసివచ్చెను. మామూలుగా పొవడములేదండీ.

న్యాయా:-ఎందుకో? వారు బ్రాహ్మణులేగదా?

విద్యా:-నేనుకొంచెము.....ఆచారము, మడుగు, మైల, ఉంటుందికదా! పూజ, పురస్కారము, లేనియింటికి పోవడము కొంచెము కష్టముగానే యుంటుందండీ!

"హరిచింతింపకమత్తుడై....."

దఫేదారు:--వద్దు, వద్దు.

న్యాయా;- ఆచార్లుగారూ! ఇది పురాణస్ధలముగాదు. ఆశనివారమునాడు మీరు వారింటికి ఎందులకుపొతిరి?

విద్యా:- తల్లి ముసలిది. చనిపొయియుండెను. ఆఖైరు ప్రాయశ్చిత్తమయినను చేయించి కొంచెము ఆత్మశుద్ధి కలిగింపవలెనని. బ్రాహ్మణ్యములో కర్మలేక శవమును సాగించుట దురాచారము.

న్యాయా:-మిమ్ముల నెవరైనను పిలిపీంచియుండిరా?

67