పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


మధుర:- అధాస్వామి! చేనా ఆచ్చర్యముగా ఉండాది. ఇంటివా డుదా గొంగ అని నేనుతలుస్తాను.

వకీలు: - బుద్ధి ఎక్కడ ఉన్న దయ్యా నీఇన్ స్పెక్టరుకు? ఇంటిదొం గేనిజము. అయి తే ఎప్పుడీపని చేసియుండునని కొంచెమాలో చించవలెను. ఆ మాలోచన భాగమే మాయిన్ స్పెక్టరుకు సున్న,

మధుర: _ గుంస్తా చేసిండాడని నాబుద్ధి. మాఇన్ స్పెక్టరుగారు చిన్ శెట్టి పైన గుమానీ "పెట్టిండాడు

వకీలు: __ పాత కాలపు హెడ్ కానిస్టేబిల్ అయ్యానీవూ! ఈ కొత్త ఇన్ స్పెక్టర్లకు కేసుపత్తాచేసే పద్ధతు లేమి తెలియును?

మధుర : _ బుద్ధికి దా ఏ తెలుస్తుంది సామీ?'

భీమ. — “దారిద్ర, దుఃఖేన కరోతిపాపం.', ఆచార్యులవారూ! ఏమంటారు? (వకీలు, ఆచార్యులు గుసగుసలాడుదురు) మధుర: – ఏంసామి! కొత్త గుంస్తానుపత్తి గాదే వారు మాట్లాడు తూవుండేది, శ్రీధర శాస్త్రి.....

(వకీలు ఆచార్యులవారి చెవిలో ఏమియో చెప్పును.)

మథుర:- సరిదా సామి! నాకంత తెలసిదా ఉండాది. నేనౌకరి ఎం దుకు స్వామి విడిచింది వారు?

వకీలు. __ ఏమో పాపం జీతం చాలక.

మధుర: – ఇప్పుడు శెట్టిగారివద్ద తక్కువ జీతానికి దా వచ్చిండారే?

భీమ...........

విద్యా:-- పిళ్ళె గారూ! వకీలుగారికి ధర్మగుణం; గొప్ప మనస్సు; వారు ఒక్కరికి చెడుపు చేసేవారుగారు. నేను చెప్పెదను వినండి . కక్షి దార్లు స్టాంపుకు అని, కాపీలకని దుడ్డుఇచ్చుచుందురు గదా! లెక్కలు వ్రాసేది గుమాస్తాగారే. ఇట్ల నేయుంటుంది గదా...... దారిద్యము. . .ఆశ... . సమయము....... నేను మీకు చెప్పవలయునా? కొన్ని రోజులకు బయటబడెను. అప్పుడు పనిలోనుంచి తొలగింపవలసివచ్చెను విధి లేక

55