పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అంకము


భీమ:- (ఆలోచించి) శ్రద్దగా!శ్రీధరుడు ఎన్నటికైనను చోరకృత్యమును చేయునా? న్యాయప్రవర్తనుడే!

విద్యా:-రావుజీ! న్యాయప్రవర్తకత్వము సన్మార్గమే? ద్రవ్యార్జన సులబమగు వఱకు దుర్మార్గమును త్రొక్కనే రాదు. ఇదివిశేష నీతి. (అనినవ్వును) మీరు యోచింపకుడు. నేనంతయు సవరించెదను,. విధవా వివాహమును నిరొధించుటకై వేయి బొంకులు బొంకినను పాపములేదు. ఒక్కమాట-ఆ-మీనౌకరు యల్లప్పను నమ్మవచ్చునా?

భీమ:-మంచి నమ్మకస్ధుడు. ఏల?

విద్యా:-ప్రకృతము మీకుచెప్పుట కవకాశములేదు. మీరులోనికి వెళ్ళి యల్లప్పను ఇచ్చటికి పంపుడు.

భీమసేనరావు లోపలికి వెళ్ళును.

యల్లప్ప ప్రవేశించును.

విద్యా:-యల్లప్పా! నీసమాచరమునుగూర్చి పంచాంగము చూచితిని. గోచారరీత్యా నీకిప్పుడు గ్రహములు బాగుగలేదు.

యల్లప్ప:_ స్వామి! స్వామీ!! నన్నుకాపాడే భారము మీది.

విద్యా:-భయపడకుము నీగ్రహములు మిక్కిలి వక్రించినవి. నీవు నేను చెప్పినట్లు చేయకపోయిన నీకు త్వరలోనే కారాగృహ ప్రాప్తికలుగును.

యల్లప్ప;-అయ్యో స్వామీ! (అనిపాదములపై బడును)

విద్యా:-లెమ్ము. భయపడకుము. నేనుచెప్పినట్లు చేసిన నీపీడ పరుల పాలగును. నేనొక రక్షను మంత్రించి ఇచ్చెదను. దానిని నీవు తీసికొనిపొయి నేనుచెప్పినచోట పడ వేయవలెను. ఎవ్వరికిని తెలియకుండ. (అని చెవిలో ఏమియోచెప్పిపంపును)

యవనికపడును

53