పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ రంకము


భీమ:-లీలావతీ! నీవు పొరబడుతున్నావు. మనధర్మశాస్త్రములలో కట్టుబాట్లు నీవెరుగవు. జగదీశ్చరుడును, ఱుషిశ్రేష్టులును, విధవలకు కొన్ని నబంధనము లేర్పరచి యున్నారు. విశేష దృష్టితో చూచిన యెడల జగత్కర్తయొక్కడే నిజమైన భర్త. సృష్టి యంతయు అతని భార్యలే. కావున స్త్రీ భర్త గతించిన పిదప వేరొకభర్తను వివాహమాడిన దైవద్రోహ మొనర్చినట్లు అగును. జగత్కర్తకు పోటీపెట్టి నట్లగును.

లీల:- అయిన భార్య గతించిన పిదప భర్త.........

భీమ:-మరల వివాహముచేసు కొనవచ్చును. చెప్పలేదా జగత్కర్త కెందరో భార్యలని!

లీల:-బాగుగనున్నది! అయిన మీయభిప్రాయము పురుషుడు సృష్టికర్త యనియా?

భీమ:-కేవలము తత్స్వ రూపము.

లీల:-అయిన తారను మోసగించిన పురుషునికి దొషమేలేదా?

భీమ:-లీలావతీ! నీకు ఈసమాచారములు బొధపడవు. నేనుచెప్పితిని గదా, వితంతువుల విషయమై ఋషిప్రోక్తములగు నిబంధనము లేర్పడి యున్నవని. హిందూ సమాజసౌధమును విద్యుత్క రీతిని ప్రవర్తించు విధవలే అలంకార ప్రియులు. విధవల నీతిచెడెనా, హిందూసమాజ సౌధము ఒక్కపెట్టున కూలి హిందూమతమే నిర్నామ మగును.

లీల:-బాగుగనున్నది!

భీమ:-అదియుగాక, పురుషుడు సృష్టికే యజమానుడు. తానుచేసిన కార్య్లమును మరుగు పరచు కొనగలడు. సమాజపు నేమములను రక్షించగలడు.

లీల:-అయిన,దోషములు రహస్యములుగ నుండు వరకు సమాజమునకు క్షేమమేగదా!

భీమ:-నిస్సందేహముగా.

లీల:-సమాజమునకు మరుగైన, సర్వేశ్వరునికి గూడ మరుగేనా?

49