పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


శ్రీధర: – అమ్మా! నన్ను క్షమిపుడు. మీరిట్లు తలచుటయే మన సమాజపు దౌర్బల్యమునకు కారణము. సమాజ మందు తాను తక్కువ తరగతిలో యున్నానని స్త్రీ, నిర్వివాదముగ ఒప్పుకొను లోపమును పురుషుడు తన దౌష్ట్యము కొరకు ఉపయోగము చే యుచున్నాడు. నీయట్టి వారు ఈవ్యర్ధ భావమును భంజించి, మన సమాజమును సంస్కరించి ఉద్ధరించుటకు నుద్యమించు కార్యము అత్యావశ్యకము గదా?

లీల – (నగుచు) శాస్త్రుల వారూ! నా కేమి పాండిత్యము గలదా? ఇంగ్లీషు నేర్చితినా? సభలయందు నుపన్యసించ గలనా? నానుండి సమాజమునకు ఎట్టిలాభము గలదు?

శ్రీధర : _ అమ్మా! పాండిత్య మేల కావలయును? ఇంగ్లీషు చదు వేల కావలయును? నాకును ఆంగ్లేయవిద్య శూన్యమే! ఈ దేశమున పూర్వము ప్రసిద్ధి జెందిన హిందూస్త్రీలందరు ఆంగ్లేయవిద్య నే ర్చియుండిరా? అనాదిగా వచ్చిన ఆర్యసంస్కృతి వలన సమాజ ము వృద్ధినొంది బలపడు నేగాని, ఆంగ్లేయ విద్య ముఖ్యముగాదు. స్వచ్ఛమైన సనాతనధర్మమున మెలగి, పవిత్రమైన భారత పతి వ్రతా శిరోమణుల అనుగ్రహము కలిగిన మియట్టివారే హిం దూ సమాజమునకు వన్నె పెట్టవలసిన వారు. నాలుగు యెంగిలి ఇంగ్లీషు ముక్కలు జదివి స్త్రీస్వాతంత్య మను నెపమున ఔచి త్యము లేని, వెఱ్ఱవర్తనలచే వ్యవహరించుచుండు ఈనాటి ఇంగ్లీ షు నేర్చిన యువతుల వలన సమాజమునకు సంకటములు కలుగు ననియేగాని సుఖములు గలుగవని నాయభిప్రాయము. నన్ను మన్నింపుడు. మన సమాజ వృక్షము చిగురించి, పుష్పించ వలెనన్న మీబోటివారికి సాధ్యముగాని, ఇతరులకుగాదు.

లీల: _శాస్త్రుల వారూ! మీరు నాయందు ఎక్కువ గౌరవముకలిగి యుండి నందులకై కృతజ్ఞురాలను. ఒక్క వేళ విధవా వివాహము నామనసునకు విరుద్ధము గాదని భావింపుడు. మీరేల అట్టి ప్రశ్న లడిగితిరి? మీరు తారను వివాహము చేసికొన వలెనని యు న్నారా?

46