పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ రంగము.


శ్రీధర: _ అయ్యా! మనోబలము లేనివాడు మహాత్ముని పూజించు టకు అర్హుడా? నీ వేల మహాత్మగాంధీని పూజించెదవు? నీ కేల ఈఖద్దరువస్త్ర ములు? ఏల ఈ గాంధీటోపి? ఊరక ఉపన్యాసము లిచ్చు వాక్ప్రభావము వలన దేశ వైభవము హెచ్చునా? ఉప న్యాసములయందు దేశభక్తి , ఆచరణయందు దేహ భక్తియా? నిర్వంచకమగు మనోధైర్యమున , నిరవధిక మైన శక్తి యు ని ర్మలమైన ప్రేమయు నిండియుండ, దేశమాతకు తమ సర్వము ను సమర్పింప సంసిద్ధులైన భారతళూరుల శిరోభూషణము ఈ గాంధీటోపి గాని, చెప్పునది యొకటి, చేయునది యొకటి యను మతమను సరించిన పిఱికిపందలకు ఈటోపీయేల? అయ్యయ్యో! భారతమాత తన ఆశయంతయు తనపుత్రులపై ననే నిలిపియు న్నదని పలుమారు లుపన్యాసము లిచ్చెదరే! మీకేల ఈ పిఱికి తనము? తల్లిదండులు లేని అనాథ బాలిక యొక్క హృదయము ను దొంగలించితిరి. అమాయకు రాలిని సౌఖ్య సాధకమగు ప్రేమ ప్రపంచమున కెక్కించితిరి. పేమబీజమును నాటితిరి. మీ వి శ్వాస రసమును నించితిరి. ఇప్పుడు ఫలించునపుడు చూచి యా నందించు భాగ్యము మీకువలదా! అయ్యా! ధైర్యము వహిం పుడు. మిపుర షతత్వ ప్రదర్శనమునకు, నా మనోదార్థ్యము నకు, మీసంకల్పసిద్ధికి, ఈ సంఘనాగర కతకును, ఇదే మంచి తరుణము.

రాజ: - (కన్నీరుగార్చును)

శ్రీధర: _ మెచ్చితి. నీ పశ్చాత్తాపమే నీకు భూషణము. తారతో మాటలాడుడు. పొండు. మగువల కాపాడు వాడే మగవాడు సుమా! (రాజా రావులోనికి పోవును. శ్రీధరుడిఁచుక వికాసముఖముతో స్వగతము గా) పాపమ!! బహుకాలముగ తల కెక్కినపిచ్చి ఇంచుక దిగుచున్న ట్లున్నది. ఏది యెట్లున్నను నాకర్తవ్య ధర్మమును నేన విడనాడ ను. మున్ముందు ఈహత భాగ్యురాలి పురోవృద్ధి యెట్లున్నదో నిరీక్షింతము.

(అని నిష్క్రమించును.)

41