పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/46

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


(రాజారావు ప్రవేశించును. ( శ్రీధరునిచూచి)

రాజు:— శాస్త్రుల వారు! తారాబాయి బాగున్నదా?

శ్రీధర:- ఆరోగ్యముగనున్నారు.

రాజ: - నేను చూడవచ్చునా? నా పైనయింకను కోపమా? నేను పిరికి వాడను నిశ్చయమే? నాతో మాటలాడిన తప్పా?

శ్రీధర:- అయ్యా! నిను గుఱించి తారాబాయిమిక్కిలి చింతించు చుండిరి. మియట్టి విద్యావంతులగు యువకులే కార్యభార మున వెనుదీసి, దేశద్రోహ మొనరించుటకు సిద్ధమైనచో మఱి మన దేశము గతియేమి?\\

రాజ — శాస్త్రుల వారూ! లోకానుభవముగల మీ యట్టివారే, సమయోచితములను, యుక్తాయుక్త ములను తిరస్కరించిన ఎట్లు?

శ్రీధర:- అయ్యా! ఏదిభూతదయా పశ్చాత్తాపములను తిరస్కరిం పదో అట్టిది నిక్క మనియే నాయభిప్రాయము.

రాజ: -ముందు వెనుక చూడవలదా?

శ్రీధర:- అవసరము లేదు. అంతరంగము ఆలకించినచో అంతయే చాలును?

రాజ: -శాస్త్రుల వారూ! పిత్రాజోల్లంఘనము ఉచితమా?

శ్రీధర: _ అనాథయగు అబలను అడవుల పాలు గావించుట మాత్ర ము ఉచితము కాబోలు.

రాజ; — పరుషోక్తు లనాడకుడు. కన్న తల్లి సంకటపడుటయైన తెలప వలదా?

శ్రీధర: - ఔరా, ధర్మము! ఔరా, దయారసము! నమ్మిన అనా థను భంగపరచి సంకట పెట్టుట తలపవలదా?

రాజ: - శాస్త్రీ! నీవాడునదినిక్కము, అయినను ఇంచుక తడయుట ఉచితము అని తోచుచున్నది. దైవముసాక్షిగ పల్కెదను. నేను నిక్కముగ తారను వివాహమాడుదును. కొంచెము నాసితిగ తులు కుదురు వరకు నిదానించుము. నేను మోసము చేయను. నిక్క ముగా మోసము చేయను. ఇప్పుడు ధైర్యము వహించుటకు నాకు మనోబలము చాలకున్నది.

40