పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/42

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ యంకము


(అని మరల ఏక నాదమును తీసికొని పాడుటకు ప్రారంభించును. పొడుచు, ఆడుచు, చెప్ప రాని సంకటమును అభినయించుచు తంతెను త్రెంపి వైచి తటా లున లేచి, ఇటునటు తిరుగుచు ఏడ్చుచు)


కాదు, కాదు. నా చేతగాదు. ఆ సాధ్వీమణి 'ప్రేమమూర్తి , ఆమో హనాంగి మొహనమూర్తి , ఆవనిత విశ్వాస విగ్రహము నా మనఃపీఠము పై నెలకొల్పి ప్రతిష్ఠగావి-పబడి ప్రతి క్షణమును పూజలు గైకొనుచున్నది. తార మోహనాకారము నాహృద యము నందంతయు నిండుకొని యున్నది. నామనస్సు నాయది కాదే. ఇట్టిరాయి చేయునట్టి నాపాట యందు తార. నాఏక తార యందు తార. నేను చూచునది తార. నేమాటలాడుచుండునది తార. నేకూర్చొనిన తార. లేచిన తార. తారా! నిన్నెట్లు మర తును? మరల కనులు మూసికొని). . .


( తార శ్రీధరుని యవస్థగని ఆశ్చర్య మునుచూపుచు నిలుచును. శ్రీధరుడు తెప్ప రిల్లుకొని)


శ్రీధ:- తారా! వచ్చితివా. ఇదే నీవుకోరిన పుస్తకమును తెచ్చితిని.

తొగ:- కొత్త పుస్తకమే. అయ్యో! నాకొరకు ఒక్క రూపాయ వ్యయము చేసితిరే. ఇప్పుడు మనకుండుస్థితిలో .

శ్రీధ: __ వీరణ్ణ శెట్టిగారు లక్ష్మీపుత్రులుగ' నుఁడువరకు నా కేమి తక్కువ? పుస్తకమును తీసికొనుము. నేను మరల అంగడికి పోవ లయును. అచ్చట-నీతో చెప్పను మరచిపోతిని నిన్న రాత్రికొం చెము ప్రమాదము సంభవిచినది. దుకాణము పెట్టియుండిన ఇనుప పెట్టెలోని కుదువ సొమ్ములలో ఒక్క చందహారము కన బడదు. ఎట్లుమాయమైనదియో ఎవరికిని తోచకున్నది. పోలీసు వారు విచారణకై వచ్చుచున్నారు. నేనిప్పుడే పోయివత్తును. నీవీ పుస్తకమును జదువుచుండుము.

తార:—మీరు పుస్తకమునకు ఒక్క రూపాయను కర్చు పెట్టినది నా కేమాత్రము సరిపడ లేదు. వీలైన ఈపుస్తకమును వాపసు చేయుడు.

36