పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి రంకము


గకు తినుటకు దంతములు వేరు, ప్రదర్శనానికి దంతములు వేరు. ప్రదర్శనము బాగుంటె చాలు, ఇదియే ఇప్పటిగొప్ప సంప్రదాయము, ఇదంతయు, నాటకమండీ! నాటకము! జ్ఞానము కావలె నయ్యా! జ్ఞానము!

భీమ:-- నేను అదేచెప్పితినండీ ఆపిల్లకు రహస్యముగా పోగొట్టు కొంటే మరల యధావిధిగా నుండవచ్చునుగదా!

విద్యా:--అంతేసరి! అదిగాక ఇట్టిపనులు చేసిన-ఇది పాపము గాదనుకొండి. ప్రకృతి! ఒకవేళ ఏదైన అకార్యము జరిగినను మన ఇప్పటి సనాతనన ధర్మము లేదా? పాపశాంతికి పుణ్యస్ధలములులేవా/ కాశి, గయ, ప్రయాగ, పూరి, బదరి, కావేరి, ఒహోహోహొ!!! ఇన్ని పుణ్యస్ధలములు పుణ్యనదులు, పాపమును చించి చెండాడలేవా/ రైలుసౌకర్యములు లేనప్పుడు ఆ పాపములు, ఇప్పుడెక్కడివి ? పైగామాబోటి బ్రాహ్మణులు లేరా? అయ్యా! గంగానదిని అపోశనముగా తీసుకొంటిమండి. విషమునే త్రాగిన ఈశ్వరుడు మాబోటి వైష్ణవాచార్యు వారికి కేవలము భక్తుడు, అట్టి మేము చేయిపట్టినచో పాపం మందుకైనదొరకునా?

భీమ:--ఔరా!హిందూధర్మము, హిందూ ఆచారము ఎంత సారవంతముగానున్నది! ఈబ్రాహ్మణ్యములో ఎంత సౌకర్యమైన ఏర్పాట్లు? బ్రహ్మణులొక్కరు లేకపోయిన ప్రపంచమే మునిగిపొవును. ఇప్పుడు కొంచెము కొంచెము సమాధాన మాయెను.

విద్యా:--పోయివత్తునా? సెలవా? ఆలోచన చేయవద్దండి. ఆచార్యుల వారుండువరకు రాయలవారికి చింతయేవద్దు. మీరు చేయుచూపొండు, మేము ఎత్తివేయుచు వచ్చెదము. మీబోటి లక్మీపుత్రులను ఏపాపము చేరదు? సెలవా?

భీమ:--నమస్కరించి ఆచార్యులవారిని పంపును. పిదప అటు ఇటు రెండు సారులు తిరుగును. ఇంతలో గుమాస్తా శ్రీధరుడు ప్రవే