పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటిరంగము

ట్టినయడల, సమాజము చెడిపోయి, దైవసంకల్పమునకు వ్యతిరేకముగా వర్తించినట్లగు. అదియేపాపము. దైవద్రోహమే పాపము. ఈరహస్యము బయలుపెట్టినయడల దైవద్రోహము చేసినట్లగును.

తార:- అయితే యిట్టికార్యములను బ్రాహ్మణులేల చేయవలెను?

భీమ:- చాలు. ఉపన్యాసము చాలు. నలుగురిలో నీమానము సంగతి విచారింపకపోతివే?

తార:- నలుగురిలో నాకగు నవమానము తప్పించుకొనుటకై నేను ప్రకృతి దేవతకు అవమానము చేయవలయునా?

భీమ:- ప్రకృతి! ప్రకృతి!! భర్త గతించిన పిదప నీకు వికృతికాక ప్రకృతి ఎక్కడ? నామాట నీవు వినకపోయిన నేనేమి చేయుదునో చూచెదవుగాక.

తార:- ఏమిచేయుదువు? బాధపెట్టుదువు. ఒకవేళ, తుదకు ప్రాణమునే తీసివేయుదువేమో! నా ప్రాణమును నేనే చంపుకొనుటకంటె వేరొకరు చంపుట మేలుగదా!

భీమ: నోరుమూయుము. పిశాచి. నాయట్టివాని కీర్తిని, మంచిపేరును చెడగొట్టి కులనాశనము చేయుటకు ప్రయత్నపడుచుకున్నావే. నేనేమిచేయుదునో చూడుము.

తార:- (ఏడ్చుచు వెడలిపోవును.)

ప్రవేశము- విద్యాలంకారాచార్యులు.

విద్యా:- ఏమి విశేషము తారాబాయి ఏడ్చుచు పోవుచున్నదే? మీయాస్థానములో ఆమె కేమి తక్కువ?

భీమ:- కలియుగధర్మము. మంచిది చేయప్రయత్నించిన చెడ్డ వెంటవచ్చును.

విద్యా:- సరియే, అది నిజము. ఇప్పుడేమైనది?