ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు.

ఈధన్యజీవిని, తెనుఁగుసీమలయందున్న తనజాతివారికి వివిధవిషయపరిజ్ఞానముఁ గలిగించు నుద్దేశముతో వ్రాసిన వివిధవిషయిక వ్యాసములే యీ,

శారద లేఖలు.

వీటినిఁ జదువుటకు ముం దీ సోదరీరత్నముయొక్క పూర్వవృత్తము నించుక యెరుగుట యప్రస్తుతము కాదు.

ఈ కవయిత్రి, పాలపర్తివారింటి యాడపడుచు. తల్లి పేరు హనుమాయమ్మగారు; తండ్రిపేరు శేషయ్యగారు; బ్రాహ్మణులు, నార్వేలవారును భారద్వాజస గోత్రులు. వీరి కాపురస్థలము గుంటూరు మండలమందలి బాపట్ల. ఈ శేషయ్య గారు, బాపట్ల సబ్‌రిజిస్ట్రారు కచ్చేరీలో నొక యుద్యోగిగా నుండి మంచి వ్య్వహార దక్షులను ప్రతీతిని గడించిరి. వీరికి రామమూర్తి గారు, నరసింహం గారు, భావనారాయణగారు, ఆంజనేయులుగారు, కృష్ణమూర్తిగారు ననువారు పుత్రులేవురును, సుబ్బలక్ష్మమ్మ, ఈవరలక్ష్మమ్మ, అనసూయమ్మగార్లను వారు పుత్రికలు మూవురును సన్తానము.

'జగమెరిఁగినబాపనయ్య'లగు నీ రామమూర్తిగారు మొదలగు సహోదరవర్గమును గురించి విశేషముగాఁ జెప్పన