ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

సప్త మైడ్వర్లు చరిత్రము


. జనుటకు రాణియనుజ్ఞ "వేడిరి. ఆమే వారందజకుఁ దగురీతిని గౌరవములు సలుప వలసిన దని మంత్రులకుఁ గట్టడ మెన ర్చె. వారును ఆ యా రాజులను వారి వారికి నర్హతములైన మార్గములు సత్కరించి, అభూధవులు రాణి సెలవు వొంది. నిజ దేశగమనో ముఖ లై. నూతన రాజదంపతులు ప్రజలకు నను రాగపర్తనులై పెండ్లి యైసయొక సంవత్సర పర్యంతము ప్రతిదినమునను విందులు గుడుచుచు సుఖం బుడిరి,

అయిదవ యధ్యాయము.

ఎడ్వర్డలెగ్జాండ్రాల నూతన దాంపత్యము.


విక్టోరియా భర్తను గోలుపోయినది మొదలు రాజకీయ వ్యవహారములలో, దాను ప్రవేశించక తనకుమారరత్నమును అందుఁ బ్రవేశంష జేయు చుండెను. అందువలన బర దేశ రాజుగాని, రాయబారులు గాని రాణి జూచుటకు వచ్చిసపుడు వారికీ చేయవలసిన గౌరవము లన్నింటిని ఎడ్వర్డుచేయు చుండెడివాడు. అతనికి బరిణియం బై కొన్ని దినములయ్యె. లండను నగరంబును, ఇంగ్లండు లోను, గొప్పగొప్పు పట్టణంబుల యందును, ఉండు శ్రీమంతులు ఈ నూతన రాజదంపతు లైనయెడ్వెర్డలెగ్జాండ్లను తమతమ యునికి పట్టులకుఁ బిలుచు కొనిపోయి వారికి యధాశక్తిని మర్యాదలు సలుపు చుండిరి.