ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలవయద్యాయము

63


నెయ్యంపుఁబట్టి నన్యునకు నొసంగునప్పుడు, ఆతని ధైర్యము నీరై ఆతని నేత్రము లను తూముల గుండ పొర్లి పార్లి రాసాగెను. వీరి వంక వారు తమఱేనియుమ్ములికంబు నుపశాంతించుటకు నాతని నోదార్చు చుండిరి. అలెగ్జాండ్రా తండ్రి, మోముం గాంచి విస్మయ దుఃకాంత్ర స్వాంతయై తన నాథుని వంక వారిచాయఁ జూచెను. ఎడ్వర్డు తోబుట్టువులు తమయన్న దమ్ముల విడనాడి పరచేడియ ను జేఁబట్టె నని లోచనకమలంబులందుండి వేడినీరు పొంగి పొంగి దొర్లుచు వచ్చుచుండ దుఃఖిం చిరి. వారు తమదుఃఖంబు సన్యు లెఱుంగ కుండుటకై తమ వదనన నరుహంబుఁల బూబంతులచేకప్పు కొనిరి. పెండ్లికి వచ్చిన వారిలో గొలఁది మంది మాత్రము వారిని జూచి పశ్చాత్తా పడిరి.

.డెన్మార్కు ప్రభువు తన ముద్దుబిడ్డను, ఎన్ని నాళ్లు పెంచిసను, ఆకన్నియ పొరుగింటిబిడ్డయే అని తలంచి, కన్నీరుఁ గొనగోటఁ జమ్మి వైచి యల్లు నకును, కూతునకును, నానావిధము లైన కానుకలను సమర్పించెను. అపరంజ మయంబు లను పైడి గిన్నెలును సవరత్న ఖచితంబు లైన భూషణంబులును, వెలలేని దివ్యాంజంబులును, ఇంగ్లండు మహారాణి వియ్యంకునకు సమర్పించెను. ఈ రీతిని నా పెండ్లివారానందాబ్దిని మునిగి తమ తమ రాజ్యంబులకు నేఁగినుద్యుక్తు లై యుండిరి.


పెండ్లికి వచ్చిన పరరాజనికరంబు లెడ్వర్డ లెగ్జాండ్రులకు బహువిధంబులఁ గానుక లిచ్చి, తాము తమరాజ్య ములకు