ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

స్తప్తమైడ్వర్లు చరిత్రము



వెల్లడి చేసినవి.. అయిన ఎడ్వర్డు ఆకాంతామణిని జూచి, తన మనస్సు నకుఁ బట్టినచిన్నదని చెప్పుటకు ముందే ఈ వార్తాపత్రికా భేకంబులు ఈ విషయమును నెల్లడి సేయుటకు నా యల్బర్టు కొంత నొచ్చుకొనెను.

ఎడ్వర్లు తన భావి ప్రియురాలిని గని వచ్చుటకు స్పేయరు హిడల్ బిగ్గు అనుతావులకు వెళ్లెను. అచ్చట నాకాంతయుఁదస కాంతుని వీక్షించుటకు నే తేచియుండెను. వారిరువురును, ఆతావులలో "రెండురోజులు... వారిద్దఱి హృదయములు లీన మయ్యెను. అంతట ఎడ్వర్డాచోటు వదలి ఇంగ్లండునకువచ్చి, తన యిచ్ఛను తల్లిదండ్రులకు నెఱుక పజిచి కేంబ్రిడ్జి కి జనెను.

ఆల్బర్టు ప్రభువు తన కొడుకు డెన్మార్కు రాజ్యపు టోడయనిపట్టిని జేబట్టు సని సంతసించి వివాహ ప్రయత్నములుసేయ నాలోచించు చుండెను. కాని “తా నొకటిఁ దలఁచిన దైవమొకటి తలంచును" అనులోకోక్తి ఆసత్య మౌ నె? అతడు తనకోరిక ప్రకారము కొడుకు పెండ్లిని "జేసి చూడ లేదు. అతఁ డొకనాఁడు కేంబ్రిడ్జున నుండిన సుతుని జూచి వచ్చుటకు వెళ్లెను.నాడు కేంబ్రిడ్జిన ద్రోణవర్షము వర్షిం చెను. కాని అతఁడు దానిని లక్ష్యము సేయక కేంబ్రిడ్జినుండి ఇంటికిఁ జనుదెంచెను. అతఁడిల్లు సేరి చేరక ముందే జ్వర మాతని నాశ్రయించెను. అతఁడు దానిచే గొంతు శ్రమ పడెను. వైద్యుల నేకులు