ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

సప్తమైడ్వర్డు చరిత్రము.


డును నాకోర్కి ప్రకార మాచోటికి వెళ్లి అచ్చట విద్యనుగ్రహింపసాగెను. అతఁడు విద్యాలయమున నందఱతో, మచ్చికతో మెలగుచు, నారిలో నెవ్వడితోను విరోధము సేసికొనక, అందఱకును మిత్రుడై వర్తించి సమస్తకళల సభ్యసించి అన్నిపలుకుల నుత్తీర్ణుండై తనయింటికి వచ్చి కొన్ని దినములు తల్లే దగ్గఱ నుండెను.

ఎడ్వర్లు కొన్ని రోజు లై నపిమ్మటఁ గన్నడా అమెరికాసంయుక్త రాష్ట్రములు మొద లగు రాజ్యములకు వెళ్లి తిరిగి యింటికి నే తెంచి, కేంబ్రిడ్డు సర్వకళాశాలలో విద్య సభ్యసిం చుటకు నచ్చోట ట్రినిటీ సర్వక ళాశాలయందుఁ జేరెను. అతఁడు పాఠశాలలో గణితశాస్త్రమునఁ బ్రవీణుడయ్యెను కట్టుదిట్టములకు లోబడి యెన్నడును ఉండిన. వా డుకాడు. ఇంటిలో నయ్య వారు వానియిష్టము నొప్పునఁ బలుకు నేర్పుచుండెను. ఇప్పుడాకేంబ్రిడ్జులో నట్లు కాదు. ఆతలను తనయుపాధ్యా యులయనుమతిని బొందవలసియుండెను. అతఁ డా నిబంధనల సహింస లేక ఒంటరిగ లండను సగరమునకు నయ్య వారల సెలవు వొందక ధపుడు కొట్టెను. అతనియొజ్జ లాతడు లాతడను 'నగరమును జేరక ముందే ఆతనిపోకను దెలిసికొని ఆ తల్లిదండలకు దెలియఁ జేసిరి. అతను రైలు స్టేషనులో దిగి దిగకము ముందే ఇంటిలో నుండు సేవకులు కొందఱు వచ్చి కాచుకోని యుండిరి. అతఁడు వారిని గాంచీ తలవంచి లజ్జితుఁ డయ్యె.