ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

35


రాణి రాజుల సమీపంబునఁ గూర్చుండి భుజించిరి. మంచి రాజునకు బిడ్డల పై గూర్మి యెక్కున. ఆతఁడాయెడ్వర్డును ప్రిన్సస్ రాయలునుజూచి విడువక వారి నాటలాడించుచుండెను. వారును హెచ్చు మచ్చికను నాయనతో నాడుకొను చుండిరి. ఆరాజు రాజ్యమును గోలుపోయి రాజ్యపద భ్రష్టుడై ఉండినప్పుడు ఎడ్వర్డు వానిఁ గాంచి పశ్చాత్తాపము నొంది వాని నప్పుడప్పుడు చూచు చుండెను.

రాణీ ఫ్రెంచి దేశమును విడిచి ఇంగ్లండునకుఁ దర్లుటకు నుద్యమించు చుండెను. ఎడ్వర్డు ఇంగ్లండునకుఁ బోవుటకు నిష్టపడక, తల్లితో ( ఆనూ ! 'నేను ఫ్రాన్సులో నుండెద. నేను లేకున్న నీ పుండ లేవా? 'నేను లేకున్న నేమి? నే నొకఁడనే నా నీ కొడుకను? నీవు వారిలో దృప్తినంది యుండుము. "అనెను; రాణి వానిమాటలకు నవ్వి వాని సచ్చట విడిచి పెట్టక తన దేశ ముసకుఁ బిలుచుకొని వచ్చెను.

ఎడ్వర్డు జనుల నిజ మైన స్థితిగతుల నెఱుంగ గోరి గూడ వేషమున ఇంగ్ల్గ్ండు. పశ్చిమ భాగమును జూడ దర్లెను. అతని వెంట నాతని యుపాధ్యాయుఁ, గిబ్సును తర్సల్ కావెండిషను, వెళ్లిరి. ఆతఁడు మాఱు వేషమున వారి వెంటఁ గాలి నడకను డివోన్ షై.రంతటను గ్రుమ్మరినను, జనులు తమయూళ్లలో కొమారుడు మాఱు వేషమునఁ గ్రుమ్మరు చుండెనని ఊహించి వాని జాడలు నెదుక బ్రయత్నించి. కాని కనుగొన లే రైరి