ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

సప్త మైడ్వర్లు చరిత్రము


సంగతుల నన్నింటిని బూస కూర్చినరీతిని వచించు చుండెడివాఁడు, అతని జ్ఞాపక శుద్ధి ప్రశంసనీయ 'మైన దని వేఱుగ వచింప వలయునా?

క్రీమియా యుద్ధమునఁ జచ్చినవారి భార్యాపుత్రాదులసాహాయ్యార్దమై ఇంగ్లండులో నిజనులు చందాలు వేసికొని పైకమును వసూలు చేసిరి. ఇందులకు బీర్లీంగటన్ శాలలో ఒక ప్రదర్శనము నడిచెను. అందు వసూ లగు ద్రవ్య మానిధికి బోవునట్టులు దీర్చు సేయుఁబ డెను. అప్పు డ నేకు లనేక వస్తువుల నా ప్రదర్శనమునకు నంపిరి. "రాణీబిడ్డలును యుక్తనయస్సుననుండి నందునఁ దనుకు బెలిసినరీతిని చిత్తరువులను వ్రాసి యూ ప్రదర్శనమున ఏక్రయమునకుఁ బంపి. వారిలో నెడ్వర్డు వ్రాసిన చిత్తరువులు 870 రూ. లకు నమ్ముడు వోయెను.

క్రిమియాలో రణము ముగిసెను, ఫ్రెంచీ రాజు విక్టోరియాను దసరాజ్యము సూడ రమ్మని యాహ్వానము పంపెను. రాణీయును ఆల్బర్టును ఎడ్వర్డును వెంటఁ బెట్టు కొని ఫ్రెంచిదేశ మునకు వెళ్లి దానికి రాజధాని యైనపారిసుపుర వరంబున ఎనిమిది దినము లుండి. ఎడ్వర్డు ననేకులు చూచి మిక్కిలి సంతోష పడిరి. ఫ్రెంచి రాజు రాణికి అనేక విందు లొనర్చెను. ఎడ్వర్డు విలువగల మంచివ స్త్రములను ధరించి రాచ ఠీవిని కొదమసింగంబు కై వడి నుండెను. రాణికి మార్సీల్సులో గొప్ప ఏందు నడిచెను. అందు ఎడ్వర్డును వానియప్పయును ఫ్రెంచి