ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సప్త మై డ్వర్డు చరిత్ర


మున "నెనిమిది గంటల కాగృహిణి ప్రసవ వేదన చెందు చుండెసని ఆ సాధ్వి తల్లి గారికిని, ఇంకను 'రాజు బంధువులకును, మంత్రులకును, సేనానాయకులకును, 'కాంటెగ్బెరి ఆక్చిబిషపు, లండను బిషపు, మున్నగువారికి వార్త వెళ్లను.

ఈ శుభవార్త లండను పురమంతట నల్లుకొనెను. మహారాణి బకింగు హాముమందిరంబున నెప్పులు బొందు చుండెను. ఒకో కొకరుగ నలు:గడలనుండి పెక్కురు నచ్చు చుండిరి.రాణి గృహకృత్యముల విచారించు: ప్రభువు, మొదట వచ్చెను. అవలఁ బ్రధానమంత్రి సర్ రాబట్టుపీలును, రాణి తల్లియును, లండను బీషపును, డ్యూక్ ఆఫ్ వెలింగ్టను మున్నగుదొడ్డవారేతెంచిరి. "రాణీ భర్తప్రిన్సు ఆల్బర్టును, "వీరులా కాక్కును, దాది లిల్లియును, రాణి కొడుకును గనిన కాలంబున నాయమ దగ్గర నుండిరి. అచ్చట గుంపు చేరిన నా యమబాధ మరింతహెచ్చు సని తలంచి అక్టు రాచకుమారుఁ డిని జేర నియ్యక రాణిసమిషంబున నుండె. 1841 - వ సంవత్సరమున నవంబరు నెల 9వ తేదీని ఉదయమునఁ బదునొండు గంటలగుటకు బండ్రెండు నిమిషములకు ముందు రాణి శుభలగ్నంబున మగశిశువును గనెను. అప్పుడు రాణి తల్లి పురుటి గదికి ఒక్క గొట్టున నుండెను. పురిటి గదికి నెదుట నుండు గదిలో వైద్యుల నేకులు రాణి గారికి మందు లొసుగుటకు సర్వసిద్ధులై యుండిరి .ప్రధానులును, సేనా నాయకులును, మతగురువర్యులును, ము