పుట:Saptamaidvardu-Charitramu.pdf/162

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

149


జనులు తమకు 'సెడ్వర్డు నెడ కల రాజభ క్తి విశ్వాసములు నెల కొల్పుచు, అపూర్వ మైన రత్నాభరణమును చేసి ఎడ్వర్డునకుఁ గానుకగా సమర్పించిరి. ఆతఁడు దాని జిగికి మదిని మెచ్చుకొని, దానిని రెండుగం జేసీ, కీరీటంబుల బొందిక పఱిచెను. ఆరత్నము వారి కిరీటంబుల నెలకొని ఎడ్వర్డు లెగ్జాండ్రులలో లేని కాంతిని గల్పించెను.

ఎడ్వర్డింతకు మున్ను జర్మని దేశమునకు వెళ్లి ఆ రాజ్యపు టోడయనిఁ గాంచి తన దేశమునకు మర లెను. జర్మని రాష్ట్రపు రాజు అమాత్య సహితు డై పరిజనులు తన్నుఁ బరి వేష్టించికొ లువ నింగ్లండునకు విచ్చేసెను. ఆయనకును, ఆయన ధర్మపత్ని కిని, అతని వెంటఁ జనుదెంచిన పరిజనములకును, వింజరు భవనం బున నెడ్వర్డు వింద్లు సలిపెను. ఆక్సు ఫోర్డు సర్వకళాశాలాధి కారులు జర్మని ప్రభువునకును డి. సి. యల్. (D.C. L.) అనుపట్ట మొసంగి. ఆ రాజును, ఆతని పరివారమును, ఇంగ్లం డునఁ గర్నల్ స్టూవర్టువోరెట్లి (Colonel Stuart Wortley) అను నాతని యునికి పట్టయిన హైక్లీఫ్ కాజులునఁ (High Cliff Castle) 'బెక్కురోజు లుండి తన దేశ ముసకుఁ జనెను. ఈతని రాక చే నాంగ్లేయులకును, జర్మని వారికిని, అంతరంగమున నుం డువిరోధము పరిసమాప్తి నొంచెను.

ఇంగ్లండునకు లోబడి యస్య రాజ్యము అనేకము లున్నవి. ఎడ్వర్డునకు మాఱుగ నాయన ప్రతినిధు లారాజ్య