పుట:Saptamaidvardu-Charitramu.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవయధ్యాయము

135


అను వానిని రాణా దారులు పట్టుకోని ఖైది చేసిరి. వాడు బోయరు యుద్ధమున న నేకులు అన్యాయముగ ప్రాణములనుగోల్పోవు చున్నారు. ఇది న్యాయ యుద్ధము కాదు. ఎడ్వర్డిట్టి యుద్ధము సలుపుటకు సమ్మతిం చెను, ఈ రాజు రణమునకు సమ్మతింపకున్న యుద్ధ మే పొసఁగి యుండదు. ఇప్పు డాయుద్ధమున సెందఱు మడియు చున్నారు. వారి ప్రాణము ఇతనివంటి ప్రాణము కాదా? విక్టోరియూ ఆతనిని గన్న రీతిని వారి తల్లులువారిని గన లేదా ? ఇతనివలె వారు మనుష్యులు 'కారా ?వారి నెత్తురు ఇంగ్లండున కై సమర్పింపఁ గోరిన యీ యెడ్వర్డు తన నెత్తు రీదేశమున కై ఇచ్చుటకు నియ్య కొన్నాడా ? నేనొకఁడును, మీరు పదుగురు. పదుగు రన్యాయము చెప్పి నను.న్యాయమే అగును. ఒక డు న్యాయము చెప్పినను అన్యాయ మగును.' అని మందలించెను, అయిరోపాఖండములో వార్తాపత్తికలు ఈ యుద్ధవిషయ మై పెక్కు వ్రాతలు వ్రాసియుండినవి. ఈ స్వీడో వానిని జూచి కలతఁ బారిన హృదయము కలవాఁడై రాజద్రోహులతోఁ జెలిమి సేసి ఎడ్వర్డు ప్రాణము గొననుద్యమించి విఫలప్రయత్నుఁ డయ్యె.

ఎడ్వర్ణ లెగ్జాండ్రులు దైవాధీనమున మృత్యువువాత నుండి బైటికి ప్రాణముతో వచ్చి నందునఁ బునర్జీవితు లైరని ఇంగ్లండులోని ప్రజలును, అయిరోపా లోని పర రాజనికరంబులును, తమ యానందంబును పెక్కు తెరగులఁ దెల్పి. ఎడ్వర్డ లె