పుట:Saptamaidvardu-Charitramu.pdf/137

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

సప్తమైడ్వెర్డు చరిత్రము


పంపెను. ఆమహా రాజకుమారుఁడు ఆమత గురువునకు నీరీతిని బదులు జాబు వ్రాసెను.

“చావు అందఱుకు వచ్చుట సహజము. మా చిన్న వాఁడు మాకొకరికే గాక, లండసుపురిలో సందరకును మంచివాడై పేరు పొందెను. అట్టివానికి మృత్యువు వచ్చుట ఆశ్చర్యముగ నున్నది. చిన్న వారుండి పెద్దలు పోవుట సహజము, నిపరీతము కాదు. ఆయినను దైవ కార్యము నాఁప నెవరితరము ? ఆనిచావు వలన మాకుఁ గలిగిన దఃఖము మమ్ముల విడిచి యెన్నటీకిని బోజా లదు. ఆది మమ్ముల సెప్పుడు పీడించు చుండును. వానికి నిప్పుడె ఇరువ డేండ్లు నిండినది. ఈ నెలలో నొకా నొక దినంబున మేము ఆచిన్న వానికి బెండ్లి సేయవలయు నని తలంచి యుంటిమి. ఆయ్యో మాకోరిక లన్నియు నిష్ఫలము లయ్యెను. ఎంత విపరీత కాలము ! ఎంతదుర దృష్టులము వానిని బెండ్లి యాడఁ గోరిన చిన్నది. వానికి బెండ్లము కాకముందే వైధవ్యమును జెందె. పసికూనే. ఎంత దుఃఖము !

భగవంతుని మాయఁ గన్న వారెవ్వరు? అన్ని కార్యములు భగవదధీన ములు, దుఃఖించి ప్రయోజవ మేమి? మా ముద్దు బిడ్డఁడు చచ్చి స్వర్గలోక మున సమస్త సౌఖ్యముల అనుభవించు చున్నాఁడు. అతడిహలోకమున నుండి దుఃఖములకుఁ బొల్పడుటకంటె, పరలోకముననుండి సుభములు గనుట మేలు కాదే! మిగిలిన వారిని జూచి దుఃఖమును కొంత శాంతిపఱుచుకొని ఉన్నారము.

ఎడ్వర్డ లెగ్జాండ్రులు దుఃఖముపశమించు వఱకు నేవ్యవ హారములు సేయక ఇంటిపట్టుననే ఉండి కాలము:ను గడపు చుండిరి.