పుట:Saptamaidvardu-Charitramu.pdf/128

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎ ని మిద వ య ధ్యాయము,

115


అలెగ్జాండ్రోను రావచ్చును, కాని, వారు వచ్చినారని బీదజను లు చెల్లించు పైకమును ఖర్చు చేసి వారికి విందులు మొదలగు "వేడుకలు సేయఁ గూడదని వచించి. ఎంద రెన్ని రీతులం జెప్పినను, ఎడ్వర్డు ప్రభృతులు తమదేశమునకు నచ్చినప్పుడు, అల్లరి చేయఁగూడదని వారు నిశ్చయించుకొనిరి. ఎడ్వర్డు సతీసహితుఁ డై పెద్దకుమారుఁడు వెంట రా నైర్లండునకుఁ జను దెంచెను. నేషనలిస్టు పార్టీ వారు అల్లరి సేయక ఊరక ఉండిరి. కాని, రెండవ పక్షము వారు తమ రాజభ క్తిని మేర లేక చూపినందున మొదటి కక్ష వారు ఆగ్రహచిత్తు లై కొంత రగడ సేయుఁ బూనిరి. ఠాణాదారులు చాల మెలకునతో వారి నాఁపిరి. ఎడ్వర్డ లెగ్జాండ్రాలు అయిర్లండును 'వాసీ తమదేశ మునకు విచ్చేసిరి.

విక్టోరియా మహా రాణికి లోబడిన రాజ్యములలోను, హిందూదేశమునను, జేయఁబడిన చిత్రవిచిత్రము లైన వస్తువులను ప్రదర్శింషనలయునని ఎడ్వర్డు తలంచెను. ఆతఁ డా యూదేశముల యందుండి వచ్చినవస్తుజాలంబుల నందంబుగ రాయల్ ఆల్బర్టు మందిరంబున నుంచి యుండె. దానికి కలోనియల్ అండ్ ఇండియన్ ఎక్షిబిషన్" (Colonial and Indian Exhibi- tion) అని పేరు. విక్టోరియామహా రాణి: అప్రదర్శన భవనంబును దెఱచెను. అప్పుడు ఎడ్వర్డ లెగ్జాండ్రాలు విక్టోరియాను మిక్కిలి గౌవించి. సమస్తవ స్తువులు రమ్యములై కనుపట్టి, అన్ని