ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

సప్తమైడ్వర్డు చరిత్రము.

మొదటి అధ్యాయము.

వంశ చరిత్రము

శ్రీ యయిదవ జార్జి ఈకాలమున నింగ్లండు స్కాట్లండు అయిర్లండు కన్నడా ఆస్ట్రేలియా హిందూదేశము మున్నగు రాజ్యములను పాలించు చున్నాడు. ఈయనతండ్రి యేడవ యెడ్వర్డు. ఇతఁడు పైనఁ బేర్కొనినరాజ్యములను జార్జికిఁ బూర్వమున నేలెను. ఈ యెడ్వర్డునకు ముందు నాతని తల్లి శ్రీ విక్టోరియా మహారాజ్ఞి యాదేశములను బరిపాలించెను. ఈ యమకు ముందు నింగ్లండు స్కాట్లండు మొద లగురాష్ట్రముల నేలుచుండినవారి చారిత్రమును ఇంచుక చెప్పి యావల నేడవయెడ్వర్డు చరిత్రమును అభివర్ణించెద .

రమారమి రెండువేలేండ్లకుముందు రోమనుపురిపౌరులు ఇంగ్లండును పాలించిరి. వారి వెనుక జర్మని దేశస్థులు బ్రిటననురాజ్యమునకు వచ్చి దానిని ఆక్రమించుకొని దానికి నింగ్లండని పేరిడిరి. వా రీయింగ్లండున నివసించుటచే వారికి