పుట:Saptamaidvardu-Charitramu.pdf/119

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

సప్తమైడ్వెర్డు చరిత్రము


వారికి విందు నొనర్చెను. అనేకులా భోజనస మయంబున నా తని చిరంజీవిగ నునుండ వలయనని ఆశ్వీరదించిరి.

1876 - వ సంవత్సరము జగవరి. నెల 1 వ తేది యుగాది పండుగ నాతడు కలకత్తాలో గడిపెను. ఈ సమయంబున నాతఁడు నిండు పేరోలగంబు నుండెను. స్వదేశీ సంస్థానాధిపతు లాచో టికి విచ్చేసరి. అతను నారందఱకు నైట్ కమాండర్ (Knights Granti Commander. వైట్స్ గ్రాండు కమాండర్ (knights Grand Cross) మొద లగుబిరుదముల నొసంగెను. వారా హోదలను గైకొని వివమిత గాత్రులై ఆయనకుఁ తమ తమ కృత తను బహు భంగుల వెలి: బుచ్చిరి. తమ దేశములకు నాయనను రమ్మని ప్రార్ధించి తమతమ రాజ్యములకు వెళ్లి రి,

ఎడ్వర్డు కలకత్తాను వదలి కాశీపురికి నేతెంచి, అచ్చట శ్రీవిశ్వేశు నాలయమును, గంగానది యౌవన గర్వంబును జూచి యానంద పరవశుడయ్యె. ఆచ్చోటును ఆతని నావలో రామనగరున నుండు ప్రాతకోట సొబగును గాంచెను. అచ్చట మహారాజా ప్రభృతు లాయనను మిక్కిలి గౌరవించి విందులు సేసిరి. అతను వారివలన రత్న ఖచితమైనదియును, బంగారు మయమైనదియును, అయిన చేతికర్రను బహుమానంబు నొందెను.

ఎడ్వర్డు అయోధ్య రాజ్యమునకు వెళ్లెను. దానికి లక్ష్మణ పురి రాజధాని, దానిచే ఇచ్చటి వారు లక్నో అని చెప్పు