పుట:Saptamaidvardu-Charitramu.pdf/114

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరవయద్యాయము.

101



కొంద ఎడ్వర్డు వెంటఁ జననలయు నని విక్టోరియాకోరి, వారిని బంప నిశ్చయించుకొనెను.

ఎడ్వర్డును ఆయన పరిజనులును, ముందు నిర్ణయించిన దినముననే ఇంగ్లండు వదలి హిందూ దేశమునకు దర్లిరి. ఆలె గ్జాండ్రా రాణి మాత్రము ప్రొన్సు దేశములో "కలె" వరకు నే తెంచి క్రమ్మఱ నింటికి వెళ్లెను. ఆవల నెడ్వర్డు ప్రభృతులు బ్రిండిజ మార్గముననే వెనుకు 'నేతెంచిరి. హేదూ దేశమున, నాయాచోటులందు నాతనితో విన్న వించుకొను వార్తలును, వానికి నాతఁ డీయ్యవలసిన ప్రత్యుత్తరములును, ఆయనకు నాతని ప్రైవేటు సెక్రీ టెరీలు వ్రాసి యిచ్చి నేర్పుచుండిరి.. అతను బొంబాయికిఁ జేరక ముందే బాబాయి మునిసిపాలిటి వారు విన్న మించుకొను వార్తలు ఆయన, చెవినిఁ బడి యుండెను.


హిందూ దేశ మునకు నెడ్వెర్డు రాబోవునని గొప్పగా పట్టణములందలి రాజులును, భాజప్రతినిధులును, మునిసిపాలిటీ వారును, ఇంకను అనేకులు అయన హోదాకు దగిన రీతిని బహుభంగుల గౌర వింప నుద్యమములు సేయు చుండిరి..పట్టణ ములలోను, పాళెముల యందును, చిన్న చిన్నగుడిసె లయం దును, అడవులలోను, నుండు సమస్త జనులును, ఎడ్వర్డు తమ దేశమునకు నేతెంచుట శుభోదయమునకుఁ గారణ మనితలంచి, ఆయనను వీక్షింప నేయేచోటుల నేయేసమముంబుల నాతడు వచ్చునని తెలిసియుండెనో ఆయాచోటులకు నాయాసమయం బుల జనులు వచ్చియుండిరి