పుట:Saptamaidvardu-Charitramu.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

సప్తమైడ్వెర్డు చరిత్రము


ఎడ్వెర్డ లెగ్జాండ్రాలు గొప్ప మేడలో నివసింపసాగిరి. ఆది చక్కఁగ నలంకృతంబై యుండెను..దానిలోని మందిరంబులు నానా విధములచేఁ బొదుగబడి చూపరుల నయనంబులకు విందు సేయు చుండెను. ఒక నాడామేడ లో టర్కి రాజ్యపు సుల్తాను,ఎడ్వర్డు భృతులకు విందు సేసెను. ఇతఁడు అందుఱతో భోజనము సేసెను. అతని మంత్రులును వానితో గూడ విందు నార గించిరి. ఎడ్వర్డ్ను, అలెగ్జాండ్రాయును, వారి తో సరససల్లాంబులు సలుపుచుఁ దమకు వలసిన భోజనమును సాపడిరి. ఏప్రెలు 5 వ తేదిని ఉదయమున ఎడ్వర్డును, ఆయన రాణియును, "కాన్ స్టాంటినోపిలు అంగడి ఏథులలో సికారి వెళ్లిరి .. ఒక నాఁటిరాత్రి నాపురబున నొక చోట నొకనాటకము ప్రదర్శిషఁబడెను. మన రాజదంపతు లాయాటను జూచు నేడ్క నాచోటికి వెళ్లిరి. సుల్తానును, ఆతావున కేఁగి, స్త్రీల చెంగిటఁ గూర్చుండెను. ఇంతకు ముందెన్నడును తురక రాజు, నారీమణుల ప్రక్కన గూర్చుండి నది లేదు. ఈరీతి నాపురంబున నారాజదంపతులుండి క్రిమీయా రాజ్యమునకుఁ బోవఁ బయనము కట్టిరి.

ఇంగ్లడు రాణి కుమారుడు, కోడలును టర్కీ దేశపు టోడయని సెలవు పొంది క్రిమియాకుఁ జనుదేర నావ నెక్కిరి. దారిచక్కఁగ సాగెను. వారు సిబాస్ట పూలు 'రేపు పురిని జేరిరి. . కొద్ది దినములకుఁ బూర్వమే నడిచిన ఘోరరణమునలన నాపురి పాడు పడి యుండెను. అంచు జను లెవ్వరు నివ