పుట:Saptamaidvardu-Charitramu.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

సప్తమైడ్వెర్డు చరిత్రము


జనులు చంపుదురను భీతిచే నెల్ల కాలంబుల నీటియడుగు భాగమున నుండును. కాబట్టి మనుష్యులు వానిని వేఁటాడుట అరిది. ఎడ్వర్డు చంపిన మొసలి మిక్కిలి గొప్పది. అతఁడు దాని నింగ్లండునకుఁ గొనిపోవఁ బెట్టెలో దాఁచి యుంచెను.

ఎడ్వర్డును, ఆ లెగ్జాండ్రా మున్నగువారును మార్చి నెలకడవఱకు నైలులోఁ బయన మొనర్చుచు, వచ్చుచుండిరి. ఈ రాజదంపతుల వివాహమహోత్సవ దిసము పండుగు నైలు నదిలోనే నడిచెను. గొప్పవారు. ఆ సమయంబున నెడ్వర్డ లెగ్జాడ్రులకు బహుమతుల సమర్పించిరి. ఈజిప్టు రాజ్యమును గల వెలయాండ్రు వారి మ్రోల నాట్యము సలిపి వారి నానందపఱిచిరి. వారలు కొన్నాళ్లు నదిలోఁ బయనము సేసి, మిని హేకు నేతెంచి, అచ్చట ధూమశకటంబు మీఁదఁ గైరో పురికి వచ్చిరి.

విక్టోరియా కొడుకును, కోడలును, వారి వెంటఁ జనుదెంచిస పరిజనులును, కెరో నగరంబున వారమురోజు లుండి మార్గాయాసమును బోఁగొట్టుకొని, అందు విచిత్రము లైనవి యును, రమ్యము 'లైనవియును, అయిన ప్రదేశములను గాంచి,టర్కీ దేశ గమనోన్ముఖులైరి .

వేల్సు రాజ్యము యొక్క యువ రాజు ధర్మపత్నీ సమేతుఁడై సూయజు కాలువ సమీపించి వచ్చెను. సూయజుభూ సంధిని కాలువను త్రవ్వు చుండిరి. ఎడ్వర్డు మధ్యధరా సముద్రమునకును, “బిట్టరు లేక్సు" అను నుప్పు చెరువులకును, నడుమ