పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/82

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - ౨ స్మండ్ కుమార్తె ఎలిజబెత్తును వివాహమాడి సిగిస్మండ్ మరణానంతరము హంగేరీని వళపరచుకొనెను. హంగేరి ఆక్రమణ : ఆస్ట్రియా, హంగేరీ దేశములకు ఉనికియందేగాక చరిత్రలోగూడ సన్నిహిత సంబంధము గలదు. రెండును, రోమను, మొరోనియను దండయాత్ర లకు గురియైనవి. కాని హంగేరియనులు మాగియారు జాతులకు చెందినవారు. ఆస్ట్రియనులు జర్మను తెగలకు చెందిన వారు. అందుచే వీరిమధ్య జాతి వైషమ్యముండుట సహజము. ఐనను చాలకాలము హంగేరీ ఆస్ట్రియా సామ్రాజ్య భాగమై యుండెను. అంతఃకలహములు : 1438 లో 5 వ ఆల్బర్టు చక్ర వర్తిగా ఎన్నుకొనబడెను. నాటినుండి హాప్సులర్థులే చక్ర వర్తి. పదవి నధిష్ఠింపసాగిరి. ఆల్బర్టు మరణానంతర మాతని కుమారుడగు లాడిస్లాస్ బాలుడగుటచే చక్రవర్తి యగు 3 వ ఫ్రెడరిక్ ఆస్ట్రియా హంగేరీలను స్వయముగ పాలింప సాగెను. 1458 లో ఆస్ట్రియా హోదా పెరిగి సామ్రాజ్య మున ప్రధాన రాష్ట్రమైనది (Archduchy), కాని చక్ర వర్తి పాలనము ప్రజలకు సమ్మతము కాలేదు. దేశ మున తిరుగుబాటులు చెలరేగెను. ఇది యిట్లుండ 1457 లో లాడిస్లాస్ మరణించెను. స్టిరియా, కరింధియా రాష్ట్రము లందలి హాప్సుబర్లు రాజవంశశాఖలవారు ఆస్ట్రియా సింహా సనమునకై పోరాడసాగిరి. ఈ అంతర్యుద్ధ మవకాశముగా గ్రహించి హంగేరియనులు బలవంతులై మెధియస్ కార్నిస్ నాయకత్వమున స్వతంత్రులగుటయే గాక . ఆస్ట్రియాను గూడ జయించి ఆక్రమించిరి. ఆస్ట్రియాలో హావ్సుబర్గులు అధికార థాను డస్తమించెనా యనుభయము గలిగెను. మాక్సిమిలియను : ఈ పరిస్థితులలో స్టిరియా హాప్సు బర్గు శాఖకు చెందిన మాక్సిమిలియను విజృభించి తన వంశ కీర్తి పతాకను నిలుపజాలెను. 1490 లో మాక్సిమిలియను హంగేరీయనులను పారద్రోలి, ఆస్ట్రియా నాక్రమించి, అందు వోప్సుబర్గు ప్రభుత్వమును పునరుద్ధరించెను. 1498లో ఇతడు చక్రవర్తిగా ఎన్నుకొనబడెను. ఇతని కాలమునందు ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమము విజృం భించుచుండెను. జాతీయ భావవికాసము, జాతీయ రాజ్య స్థాపనము ఈ యుగ లక్షణములు. స్పెయిను, ఫ్రాన్సు, 45 ఆస్ట్రియా - (హంగేరి) ఇంగ్లండు రాజ్యములందు బలవత్తరముగు రాచరికము లేర్పడినవి. మాక్సిమిలియను ఆస్ట్రియా జర్మనీలయందు అధికారము బలపడునట్లొనరించెను. బర్గండి రాకుమా ర్తెయగు మేరీని వివాహమాడి నెదర్ లాండ్స్ను (బెల్జియం - హాలెండు) సంపాదించెను. తన కుమారుడైన ఫిలిప్నకును స్పెయిను రాకుమార్తె జోనాకును వివాహా మొనర్చెను. జోనాకు సోదరులు లేక పోవుటచే ఆమెయే స్పెయిను సింహాసనమునకు వారసురాలు. ఆమె ద్వారా స్పెయినులో హాప్సుబర్లు వంశ స్థాపనకు మాక్సిమిలియన్ మార్గము కల్పించెను. 1519 లో మాక్సిమిలియన్ మర ణించునాటికి స్టిరియా, కరింధియా, కార్ని యోలా, టైరోలు ప్రాంతములు ఆస్ట్రియాలో చేర్చబడెను. ఐరోపాలో హాపు ్సబర్గుల క త్తి కెదురుక త్తి లేకుం డెను, ఫెర్డినాండ్: మాక్సిమిలియన్ పౌత్రుడగు (5. వ.) ఛార్లెసు జర్మను చక్రవర్తి అయ్యెను. ఛార్లెస్ సోదరుడు ఫెర్డినాండ్ ఆస్ట్రియాను పాలింపసాగెను. ఫెర్డినాండు హంగేరి రాకుమార్తెయగు ఆనీని వివాహమాడెను. వీరి కాలమున తురుష్కులు విజృంభించి బాల్క ను రాజ్యముల నాక్రమించి హంగేరిపై దండెత్తిరి. హంగేరి రాజగు లూయీ మోక్సు యుద్ధమున తురుష్కులచే హతు డయ్యేను. అతని బావమరదియైన ఫెర్డినాండు హంగేరికి వారసుడాయెను. ఫెర్డినాండ్, ఛార్లెసులు తురుష్కులను వెనుకకు మరలించుటకు ప్రయత్నించిరి గాని లాభము లేకపోయెను, హంగేరి పాలకుడుగా ఫెర్డినాండ్ తురుష్కు లకు కప్పము చెల్లింప సమ్మతించెను. 30 సంవత్సరముల యుద్ధము: ఫెర్డినాండు సంతతి వారు జర్మను సార్వభౌమపదము నధిష్ఠింపజొచ్చిరి. వారి కాలమున లూధరన్ మతము రోనుక సామ్రాజ్యమున బహుళ ప్రచారమునకు వచ్చెను. నూతనమతము నరిక కాథలిక్ మతమును రక్షించుబాధ్యత చక్రవర్తులది. అందుచే ప్రజాభిప్రాయమునకు వ్యతిరేకముగ చక్రవర్తులు లూధరన్ లేక ప్రొటెస్టెంటుమతము ననుసరించువారిని హింసింపసాగిరి. సామ్రాజ్యమున తిరుగుబాటులు బయలు దేరెను. 1818లో బొహిమియా ప్రజలు కాథలిక్ మతాభిమానియైన హాప్సుబర్లు ప్రభువును ధిక్కరించి ప్రొటెస్టెంటును రాజుగా నెన్నుకొనిరి. ఈ సంఘటనముతో