పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/80

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము -43 ఆస్ట్రియా - (హంగేరి)

ఆగస్టు మాసమునందు వీరు జరిపెడు 'పిరహార' ఉత్స వమునందు నృత్య కళకు ప్రాముఖ్య మొసగబడును. ఈ ఉత్సవము బుద్ధుని దంతము పూజింపబడు ఆలయమునకు విష్ణ్వాలయములకు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయమునకు సంబంధించినట్టిది. ఈ ఉత్సవమునకు సంబంధించిన ఊరేగింపు లందు నర్తకీమణులు తమ తలలపై 'కలశము'లను ధరించి నృత్యమాడుచు, ఎడనెడ ఆ కుండలను కొంచెముగా పై కెగుర వేయుచు నడచెదరు.

శాంతికుత్తు, బలి నృత్యములు : ఇవి ఆరాధన నృత్య ములు. దేవతలను, క్షుద్ర దేవతలను శాంతి పరచుటకు ఈ నృత్యములు చేయబడును. దేవతా విగ్రహములకు పూజలు చేసి మంత్రములను జదివి, అటుపై, మృదంగ వాద్య సహాయముతో నృత్యము చేయుదురు. మన దేశమునందలి అమ్మవారి కొలువులవంటివి ఈ నృత్య ములు. ఇవికాక మన భరత శాస్త్రమునందలి నృత్య రీతుల ననుసరించి వీరు కొన్ని నృత్యములను అభివృద్ధి పరచిరి. వానిలో 'వన్నము' అనునది మన నృత్యము నందలి 'వర్ణము'ను బోలిన నృత్యము. 'సౌదము' లేదా 'వందమాన' అనునది మన 'సలామ్ జతులను బోలిన శబ్దము. వర్ణము అనునది నృత్య నృత్త అభినయములు ప్రదర్శించుటకు వీలుగానుండునట్టి సంగీత రచన. ఇది భరత నాట్యమందు ముఖ్యముగా చూడదగిన ప్రత్యేక నృత్యము. ఈరచనకు పల్లవి, అనుపల్లవి, చరణములు ఉండును. పల్లవి, అనుపల్లవులకు అభినయమును, ముక్తాయి స్వరము లకు, చరణములందలి సాహిత్యమునకు నృత్త నృత్యము లును ప్రదర్శింపబడును. శబ్దములు వీనికే సలాము జతులనియు పేరు. ఇందు మృదంగ జతులు, తీర్మానములు, పాటలు ఉండును. పాటలు రాజులకుగాని, దేవతలకుగాని వందనము అర్పించుటతో ముగియును. కనుకనే వీటికి 'సలామ్' లేక 'జోహార్ ' జతులని పేరువచ్చినది. పాట యంతయు వర్ణనములతో నిండియుండి, తుదిని, 'పద్మనాభ స్వామి జోహార్ అనియో లేక 'ప్రతాపసింహ సలామ్ ' అనియో ఉండును. ఇట్టి నృత్యములను సింహళదేశీయులు గూడ విరివిగా ప్రదర్శింతురు. ముఖ్యముగా 18 రకము లైన 'పన్నములు' సింహళదేశ నృత్యములందు ప్రదర్శింప బడును. ప్రతి ‘వన్నము' ఒక ప్రత్యేక తాళములో, గతిలో, జతి, తానము, అడవులు, 'కన్మీరా' అను వాటిని కలిగి యుండును. 'కనీ తీరా' అనగా మన నృత్యములందు ప్రదర్శించెడు తీర్మానము.

వారు ప్రదర్శించెడు 18- వన్నముల పేర్లు : (1) గజగ, (2) నయియాది, (8) కిరళ, (4) ఇరాది, (5) ఉదర, (6) సింహరాజ, (7) హనుమ. (8) గణపతి, (9) సవుల, (10) గహక, (11) వై రోది, (12) మయూర, (18) తురగ, (14) సురపతి, (15) ముసలాడి, (18) ఉకుస, (17) ఉరగ, (18) అసాద్రస- అనునవి.

ఈ వన్నము అన్నింటికిని వారి నృత్యమందలి కథలను, భావములను అనుసరించి పేర్లి య్యబడినవి.

ఉదా : గణపతి వన్నమందు గణపతి యొక్క వర్ణన ముండును. 'తురగ' అనునది అశ్వగతిని దెల్పునట్టిది. ఈ వన్నములు ఆయా పాత్రల నృత్యములందు ప్రదర్శింపబడును.

ప్రారంభ శబ్దములు లేక తాళము : దోం దోం గణిను జిగత

తానము : తతు తతు తనకు త నెన నతు తతు తనతు త నెన త త్తతు తనతు త నేన తాన తన త నేన తన త నేన త నెనతు తనతు తందనతు తందనాన. తీర్మానము క్రుబాగజితు కస్తీరము క్రుతగజి క్రుతగజితు జిత క్రుచాన్

పై జెప్పబడిన శబ్దకట్టు పేరు 'తురగవన్నము'- దీనికే 'తురగగతి' యని, మన శాస్త్రములందు పేరు. ఈ గతిని మృదంగముపై పలికించినప్పుడు అచ్చముగా తురగము పరుగెత్తుచున్నట్లు మనకు తోచును. అశ్వగతిని నృత్యమందు ప్రదర్శింపవలసినప్పుడు వీరు ఈగతి ననుసరించి పాద విన్యాసము చూపుదురు.

న. రా.


ఆస్ట్రియా - (హంగేరి) :

ఆస్ట్రియా అనుమాట 'ఆస్టరిఖ్ ' అను పదమునుండి వచ్చినది. ఈ పదమునకు "తూర్పు రాజ్యము" అని అర్థము. క్రీ. శ. 9వ శతాబ్దారంభమున ఫ్రాంకుల చక్రవర్తియగు