పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/799

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కుడ్యచిత్రణము చిత్రించవలసిన గోడ గచ్చుచే కట్టబడినదై యుండవల యును. ఒక గ్లాసు నీటిలో ఓ వ భాగముపై పాత సున్నము వడియబోసి, కలిపియుంచవలయును. ఈ నీటిని గోడపై నాలుగైదు సారులు పూసినచో నొక తెల్లనిరంగు తయారగును. దానిపై, పై సుదాహరించిన మిశ్రణమును ఒకేసారి పూయవలయును. మట్టి రంగులలో కొంచెము బంకమన్ను, సున్నము కలిపి పలుచనైన రంగులతో (Water colour Painting) ఇటాలియన్ పద్ధతిలో చిత్రించవలయును. చివరకు మల్ మల్ గుడ్డతో అదేరోజు బాగుగా పాలిషు చేయవలయును. ఇట్టిచిత్రమును నీటితో కడిగినను, అది గోడనుండి వేరుగాకుండును. పైగా మెరయుచుండును. పాచీన చిత్రకారులకు కొన్ని ప్రత్యేక పద్ధతులు తెలిసి యుండెడివి. కానీ వారు వాటిని అతిరహస్యముగా దాచియుంచేడిపారు. కావున ఆపద్ధతులు వారితోనే సమసిపోయినవి. ప్రాచీన దేవాలయములను, సభామంది రములను చిత్రించునప్పుడు గోడలయందేగాక, పైకప్పుల యందును, స్తంభములయందునుకూడ అట్టి చిత్రము లనేకములు వేసెడివారు. శిల్పములపై గూడ చిత్రించు ఆచారము మెండుగా నుండెడిది. నేటి కాలములో చిత్రకారులు ప్లాస్టరు గోడలపై ఒక బకెట్టు నీటిలో నొక కోడిగ్రుడ్డును పగులగొట్టి బాగుగా నరుగువచ్చునట్లు కలుపుదురు. ఆ నీటిని ఒకరోజు మొద టనే నీటిచే తడుపబడిన భూమి పై పూసేదరు. తరువాత రంగులను ఉడుకైన సరచ్చు నీటితో గలిపి టెంపరా పద్ధతిలో చిత్రించు నాచారముగలదు. ఇది సులభమైనది. కాని నీటి తాకిడికి చిత్రము చెడిపోవును. ఫ్రెస్కో చిత్రణమునకు అనుభవమున్న చిత్రకారులే పనికివత్తురు. కుడ్యచిత్రముల బంధము (Composition): సామాన్య చిత్రములకున్న సూత్రములే ఈ చిత్రములకు గూడ పనికి ఈ వచ్చును. కుడ్యచిత్రముల ప్రయోజనము బహుకాలికము. వీటి ప్రమాణములు పెద్దవి. ఒకేచోటున నిలుచుండి చూడబడునవిగాక, ఇవి ఒకచోటునుండి మరొక వైపు నకు నడచి చూచునంత పొడవును, వైశాల్యమును కలిగి యుండును. ఈ చిత్రములందు ఒకే ప్రధాన వస్తువు అనేక స్థలములందు చూపబడును. కావున గోడపై అనేక సంగ్రహ ఆంధ్ర స్థలములు ప్రధానాంశములుగా చూడదగియుండును, విశాల స్థలమును రమణీయముగాను ఆకర్షకముగాను చేయుటకు చిత్ర వివరములు పెంచవలసియుండును. ఉదా : బట్టలలోని అలంకరణములు, భూషణములు, చెట్లు చేమలు, పర్వతములందలి జంతువులు, పక్షులు, పూలు మొదలగునవి. కొంచెము స్థలములో అధిక కథా భాగమును చూపించవలసి యుండుటచే సుదూరములు, ఎడములు తగ్గి కొన్ని ఆకృతులు సహజప్రమాణములు మారి, ఒక చోట చిన్నవిగాను, మరొకచోట పెద్దవిగాను కనిపించును. ఉదా : అజంతాలోని బోధిసత్వుని (అవలోకి తేశ్వరుని, పద్మపాణిని తిలకించుడు. లేపాక్షిలోని పార్వతీపర మేశ్వరుల వేట, అర్జున చిత్రము ఈ విధము గానే చిత్రింపబడినవి. పరిపేక్షితి సిద్ధాంతము (pers- pective) ఈ చిత్రములయందు సఫలము కాజాలదు. వాటికన్ ప్యాలెస్ లోని కుడ్యచిత్రములను చూచినచో గూడ నీ విషయమే ద్యోతకమగుచుండును. ఒకేకథ అనేక భాగములుగా చిత్రింపబడునప్పుడు ఒక సన్ని వేళ మునకును మరొక సన్నీ వేళమునకును మధ్య కథా సందర్భమునుబట్టి వచ్చు చెట్లు, గుట్టలు, భవనములు, జంతువులు, నీరు మొదలగు వానిచే స్థలమును విభజించు నాచారము గలదు. మధ్య ఒక కథ పూర్తియైనచో చక్కని నిలువు గీతలచే కొంతస్థలమునిచ్చి అలంకారము చేయుట బాగుగ నుండును. అవసరముననుసరించి పట్టీలు కల్పించవచ్చును. చిత్రము కంటికి ఉపరిభాగమునందుండి చాలా ఎత్తైనచో ఆకృతులు పెద్దవిగా నుండదగును. అవి దూరమునుండి చూచుటచే చిన్నవిగా గోచరించును. ఇట్టి చిత్రముల పై భాగములలోని ఆకృతులు పెద్దవిగా చిత్రించవలయును. కుడ్య చిత్రములలో ఎన్నికథలున్నను, ఎన్ని విషయము లున్నను అన్నియు ఒకేయూనిట్ గా గోచరించవలయును. చిత్రములో నుండి ఏ ఒక ప్రత్యేక భాగము రంగులచేనైనను, ఛాయలచేనైనను, గోడనుండి విడివడి పైకి దూక వచ్చిన ట్లుండగూడదు. నలుపు తెలుపులు చిత్రించునపుడు అవి గోడలపై మచ్చలు గానో, రంధ్రములుగానో గోచరించ గూడదు. స్థాయిని (Balance) చక్కగా నుండునట్లు చిత్రించవలయును. మొత్తము చిత్రములో ఏకత్వము శైలియందును, రంగులయందును, ఉండునట్లు చిత్రించ 746,