కుడ్యచిత్రణము మొదలగువారి వ్రాతల వలనగూడ ఈ విషయము తెలియుచున్నది. అత్యాధునీకుల అభిప్రాయములు నిజమయిన ఫ్రెస్కో (genuine fresco) నే బలపరచుచున్నవి. మధ్యమయుగ (mediaeval period) సంబంధ మైన ఫ్రెస్కోలను సంబంధమైన గురించి థియోఫిలస్ (Theophilus), మౌంటు ఆథస్ (Mount Athos) రచనలు తెలుపుచున్నవి. ఈ శాల ములో ఆరిన గచ్చు భూమికను బాగుగా తడిపి సున్న ముతో గలిపిన రంగులచే చిత్రించెడివారు. పదునేడవ శతాబ్దమున ఇటాలియనులు సక్కో ఫెస్కో పద్ధతిని ఉన్నతదశకు తెచ్చిరి. రంగులను కోడిగ్రుడ్డు సొనతో కలిపి వాడెడివారు. వారు గ్రుడ్డు సొనను అతు కుడు పదార్థముగా వాడేడివారు. అటులనే బువన్ ఫ్రెస్కోలో (అనగా తడిగానున్న ప్లాస్టరుపై చిత్రించు విధానము) వారు రంగులను నీటితో కలిపి తడిగానున్న గచ్చు భూమిక పై చిత్రించెడివారు. మొత్తము చిత్ర మును మొదట ఆరిన భూమికపై వ్రాసెడివారు. దానిపై నిత్యము పలుచని గచ్చుపొర ఆరోజు చిత్రించగల భాగము వరకు వేసి ఆరకముందే నీటితో గలిపిన రంగులను హెడెడివారు. ఆ రోజు సాయంత్రము చిత్రము వేయగా మిగిలిన భాగమును గీకి వేయువారు. మరుసటి రోజు జోడించి మిగతా ప్లాస్టరు వేసి చిత్రించెడివారు. కావున నేటికిని ఆ అతుకులను మనము గోడలపై కాంచ వచ్చును. సున్నము సున్నము, ఇసుక ప్రమాణములు సినినో నెన్నినీ (Cenino Cennini) సూచించిన ప్రకారము (Sectrans...by C. J. Herringham 1899) ఒక భాగము సున్నమును, రెండు భాగములు ఇసుకయు కలుప వలయును. బట్టి పెట్టిన సున్నమును (Slaked lime) నీటిలో కొన్ని నెలల పర్యంతము, ఒక సంవత్సర కాలము వరకుగూడ నానబెట్టిన జిగట సున్నము (lime putty) పక్వమగువరకు (mature) కాపాడవలయును. రంగులు : రంగులు (pigments) సున్న ముచే భిన్నము గానివిగను, వెలుతురుచే వెలవెల పోనివిగను ఉండవల యును. తెలుపు రంగును ఆ సున్నముచేనైనను, లేక సున్నపురాళ్ళను నీటిలో ఉడక బెట్టి (నీటిలో వేసినంత నే 742 సంగ్రహ ఆంధ్ర ఉడుకును. నిప్పుపై బెట్ట నవసరములేదు) యైనను తీసి గాలికి ఆరబెట్టి కొంత కాలమునకు కేకులు (ముద్దలు) గా జేసి గాలికి ఆరబెట్టవలయును. అట్టివాటిని తెలుపునకు బదులు ఉపయోగించవచ్చును. ఇతర వర్ణములలో మట్టి లేక శిలలనుండి తీసిన రంగులు (ochres) జాజు (red- ochre). పచ్చనట్టి (Yellow ochre), ఆకుపచ్చ రాయి (Terreverte), అంబరుమట్టి (umber), రాసేవా (పచ్చ మట్టిలో కొంచెము నలుపు వర్ణము గలది), నల్లజాజు (Burnt Seina), నల్లరంగు (మసి), స్థిరవర్ణమగు నీలి, ఆకుపచ్చరంగులు, ఆక్సైడ్ వర్ణములు (ఉదా : క్రోమి యమ్, వలీడియస్ గ్రీన్, కొబాల్టు బ్లూ, మరియు సెరూ లియన్ బ్లూలు) ఉపయోగించవలయును. ఇటాలియనులు స్మాల్టు (Smalt) ను కని పెట్టుటకు పూర్వము అజురైట్ (Azurite) పలుచని నీలవర్ణమును ఉపయోగించెడి వారు, ఈరంగు, సున్నపు సంపర్కముచే క్రమముగా ఆకు పచ్చగా మారెడిది. ఇదిగాక విలువగల అల్ట్రా మెరన్ (గాఢమైన నీలము) నుపయోగించెడివారు. వీరు బహుళ నీలవర్ణములను గ్రుడ్డుసొనలో కలిపి వాడెడివారు. జయపుర కుడ్యచిత్ర విధానము (Jaipur Fresco) : జైపూర్ (రాజస్థాన) సంస్థానములో ఈకళ ప్రాచీన కాలమునుండి అభివృద్ధి చెందియున్నది. కాని అచ్చటి చిత్రకారులు ఈ కళను కేవలము అలంకరణ కళగానే పరిమిత మొనర్చిరి. లతలు, చెట్లు, పదులు వేయుట యందు లేక అద్దమువలె మెరయునట్లు గోడలను గీలాబు చేయుటయందు వారు తమ నై పుణ్యమును చూపసాగిరి. కానీ కొలదికాలము క్రితమే శ్రీయుత నందలాల్ బోసు గారు ఈ విషయమును గ్రహించి ఈ పద్ధతిని ఫ్రెస్కో చిత్రములలోనికి మార్చిరి. ఇట్టి చిత్రములు కొన్ని శాంతి ని కేతనములో లైబ్రరీకి ముందున్న వరండాలో చిత్రింప బడియున్నవి. వర్షపాతమువలన వీటి కెట్టివానిక లుగనేరదు. కాని అద్దమువలె తళతళలాడు ఇవి పొగచేతను, పిల్లలు మేకులతోను రాళ్ళతోను గీకివేయుట చేతను, గీతలుపడి చెడిపోవును. ఈపద్ధతికిని ఇటాలియన్ ఫ్రైస్కోల పద్దతికిని భేదములేదు. జయపుర పద్ధతిలో మాత్రము మెరుగు చేసి నునుపుచేయు ఆచారము గలదు. ఇట్టిఆచారము ప్రాచీన ఈజిప్షి యనులలోగూడ ఉండెనని తెలియుచున్నది.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/795
ఈ పుటను అచ్చుదిద్దలేదు