విజ్ఞానకోశము రచించిన "ది ఎక నామిక్ కాన్సెక్వెన్సెస్ ఆఫ్ సీస్" అనునది ఒక ఉద్గ్రంథమనక తప్పదు. యూరపు ఆర్థికాభ్యుదయమున జర్మనీ నిర్వహింప వలసిన పాత్ర ప్రముఖమైనదనియు జర్మనీ ఆర్థిక వ్యవస్థ కుంటువడినచో ప్రపంచ ఆర్థిక సుస్థిరత కే భంగము వాటిల్లుననియు ఇందాతని వాదనయైయున్నది. కీన్సు ఉపాధ్యాయవృత్తికి మరలి కింగ్స్ కళాశా బర్సారుగా పనిచేసెను. ఈకాలమున కళాశాల ఆర్థిక వ్యవహారములను ఆతడు మిక్కిలి సమర్థతతో చక్రది ద్దెను. మరియు 1912 నుండి అర్ధశాస్త్ర సంచికకు సంపాదకుడుగా ఆతడు చేయుచు వచ్చిన కృషి అనల్పము, 1929 లో ఆతడు "ది ట్రాక్ట్ ఆన్ మానిటరీ రిఫారమ్" అను గ్రంథ మును ప్రకటించేను. లలో 1925 ఆతని జీవితములో మరువరాని సంవత్సరము; ఏలయన రష్యను ఇంపీరియల్ బ్యాలెట్కు చెందిన నాట్య తారయగు లిడియా లొపొకోనా అను నామెను కిస్సు ఆసంవత్సరము వివాహమాడెను. ఈసంగతి వినిన మార్షలు సతి “మా మేవార్డు చేసిన పనులలో నెల్ల చాలా మంచిపని ఇదే” అని వాత్సల్యపూర్వకముగా అన్నదట. అతని సంసార జీవితమును ఆనందమయ మొనర్చి హృద్రోగము వలన బాధ పడుచుండిన ఆతనికి తుది దినములలో ఎన లేని సేవ జేసిన గృహిణి లిడియా కీన్సు. ఆసంవత్సర మే 1. రష్యా వారి సంకుచితదృష్టి (A short view of Russia) 2. చర్చిలు ఆర్థిక విధాన ఫలితములు (The Economic Consequences of Churchill) రెండు గ్రంథములను ఆతడు రచించెను. ఈ రెండు పుస్తక ములును విమర్శనాత్మకములే. మొదటి పుస్తకమును బట్టి కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థను, రష్యను ఉత్పత్తి విధా నమును ఆతడెన్నడును మెచ్చియుండలేదని తేటపడు చున్నది. ఇక రెండవ పుస్తకమునందలి విషయమిది: అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వములో ఆర్థికశాఖకు విన్స్టన్ చర్చిల్, ఛాన్సెలర్ గా నుండెను. చర్చిలు సూచనప్రకారము యుద్ధమునకు పూర్వము బ్రిటిష్ పౌండుకుగల బంగారు విలువ ననుసరించి బ్రిటను స్వర్ణద్రవ్య ప్రమాణమును (Gold Standard) తిరిగి అవలంబించెను. ఇందువలన కలుగు ఇబ్బందులను కీన్సు ముందుగనే గ్రహించెను. ఆర్థిక మాంద్యము ప్రగాఢమగునని, నిరుద్యోగ సమస్య విషమ 735 4 కీస్సు, జె. యం. మగునని, ఎగుమతి పరిశ్రమలలో ఉత్పత్తి పడిపోవునని, బ్యాంకులు బంగారము కేటాయింపులలో కొరత ఏర్పడు నని ఆతడూహించి తెలియజేసెను. యుద్ధమునకు పూర్వము గల మారకము రేటు ననుసరించి, ఒక పౌండునకు డాలర్ల 86 సెంట్లు వచ్చుచుండెను. అప్పటి మారకము రేటు ననుసరించి ఒక పౌండునకు 4 డాలర్ల 40 సెంట్లు మాత్రమే వచ్చుచుండెను. కావున ఈ మారకపు రేటు ఉన్నంత కాలము బ్రిటనులో ఎగుమతి పరిశ్రమలు విస్తృ తములు కావలెనసిన, సాంప్రదాయక ఆర్థిక సిద్ధాంతము ప్రకారము ఉత్పత్తి ఖర్చులును అందుకుగాను జీతగాళ్ళ బత్తెము డబ్బులును తగ్గవలయును. వేతనముల తగ్గింపునకు అంగీకరించని శ్రామికవర్గము నిరుద్యోగ సమస్య నాహ్వా నించవలయునని దీని అర్థము. స్వర్ణ ద్రవ్యప్రమాణములను దాని పేర బ్రిటిష్ శ్రామిక వర్గము ఈకష్టనిష్ఠురములను ఎందుకోర్వవలెనో కీస్సుకు అర్థము కాలేదు. నిజముగా సమకాలిక ఆర్థిక సంఘటనలపై ఇంతటి ప్రాబల్యము కల్గియుండిన వ్యక్తి అర్థశాస్త్రవేత్తలలో ఏడమస్మిత్ తరువాత ఇతడే. వ్యక్తిగతమైన ఈతని ఉపజ్ఞ వలననే బ్రిటనునందలి ఉదారవాదుల రాజకీయ పక్షము (The Liberal Party) 1928 లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించుటకై పబ్లిక్ వర్క్సు చేపట్టుట, దేశీయ ద్రవ్య మును విస్తృతపరచుట అను అంశములను తనపార్టీ కార్య క్రమములలో చేర్చుకొనెను. ఎగుమతి పరిశ్రమలలో ఉత్పత్తి క్షీణత నానాటికి హెచ్చుచుండ, బ్రిటిష్ పారిశ్రామిక సమస్యను, పెట్టుబడి సమస్యను పరిశీలించుటకు ప్రభుత్వము మెక్మిలను కమిటీని నియమించెను. ఈ సంఘసభ్యుడుగా ద్రవ్యసిద్ధాంతముపై తనకు గల ఊహలను కిస్సు యథేచ్ఛముగా వెల్లడిచేసెను; మరియు 1980 వ సంవత్సరములో ద్రవ్యశాస్త్రమున తన విప్లవాత్మక భావములను "ఏ ట్రీటైజ్ అన్ మనీ" అను గ్రంథము యొక్క రెండు సంపుటములను ప్రపంచమున కందజేసెను. ఇంగ్లండు బ్యాంకులకెల్ల కీలక స్థానమును ప్రభుత్వ సంస్థయు అయిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండుకు అతడు డైరెక్టరుగా నియమింపబడెను. 1981, 1938 సంవత్సరములలో "ఎన్సేస్ ఇన్ పెర్సు ఏషన్ (Essays in Persuasion), ఎస్సేస్ ఇన్ బయో
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/788
ఈ పుటను అచ్చుదిద్దలేదు