కీస్సు. జె. యం. ఖండాంతరములలో బ్రిటనుకుగల పెట్టుబడి నిధులు చాల వరకు యుద్ధావసరములకుగాను కరగిపోగా బ్రిటను ఋణగ్రస్త రాజ్యమాయెను. యుద్ధకాలమునందును, తరువాతగూడా ద్రవ్యోల్బణము ఫలితముగా ప్రపంచమం దంతటను ధరలు విపరీతముగా పెరిగిపోయెను. ఇంతలో ఆర్థిక మాంద్యము తెచ్చి పెట్టిన నిరుద్యోగ సమస్య మన ఆర్థిక వ్యవస్థను పునాదులతో కదల్చివేసిన చాయెను. సమస్యా పరిష్టారమును సూచించు మేధావి ఏ దేశీయు డైనను అతనిమాటను శిరసావహించుటకు ప్రపంచము తహతహపడుచుండిన రోజులవి. వాస్తవమునకు ఫ్రెంచి విప్లవము తరువాత భావనాప్రపంచములో అంతటి సంచలన మెన్నడును కలుగలేదు. రెండు యుద్ధముల నడిమి కాలమున (1918-1988) అర్థశాస్త్రములో రెండు కీలక స్థానములయందు సిద్ధాంతము పునఃపరిశీలనము కావింపబడుట జరిగెను. ఒకటి-ద్రవ్య సిద్ధాంతము (Monetary Theory). ద్రవ్యోల్బణము, మిన్నంటిన ధరలు, అంతర్జాతీయ వాణిజ్య, విదేశీయ ద్రవ్య వినిమయ సమస్యలు ఈ రంగమునందలి ఒడుదొడుకులకు సంబంధించినవే. రెండవది- నిరుద్యోగ సమస్యను పరిష్క రించుటకు జాతీయ ప్రభుత్వములు ఎంతవరకు ప్రయివేటు ఆర్థిక విధానముతో ప్రమేయము పెట్టుకొనవలయును అననది. ఏలనన మన సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థ 'ఏడమ్ స్మిత్తు' కాలమునుండి 'అల్ఫ్రెడ్ మార్షల్' నాటివరకు వ్యష్టిసాహసము పైనను యథేచ్ఛా వ్యాపారము పైనను ఆధారపడి యున్నదే. ఈ రెండు కీలక సమస్యలను కూడ ఈ ఒక రాజకీయ ఆందోళవకారునివలె కాక సాంప్రదాయక ఆర్థిక సిద్ధాంతవాదుల ఆమోదముద్ర లభించునటుల సంపూర్ణముగను, సమగ్రముగను, "స్త్రీయముగను చర్చించిన కీర్తి ఆనాటి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమునకు సంబంధించిన అర్థశాస్త్రవేత్తయు, ప్రొఫెసరు మార్షలు శిష్యుడునగు జాన్ మేనార్డు కీన్సునకే దక్కినది. 1883 వ సంవత్సరము జూన్ నెల 5వ తారీఖున జాన్ మేనార్డ్లు కిస్సు జన్మించేను. అతని తండ్రి జాన్ నెవెల్లీ కీన్సు ఆర్థిక, తర శాస్త్రములలో సుప్రసిద్ధుడగు రచయిత. అతని తల్లి కేంబ్రిడ్జినగర పురపాలక సంఘమునకు మేయ రుగా పనిచేసెను. 1 734 సంగ్రహ ఆంధ్ర జాన్ మేనార్డ్లు కీన్సు విద్యార్థిదశ మహోజ్జ్వలమైనది. కింగ్సు కళాశాలలో ఆతడు విద్యాభ్యాస మొనర్చునపుడు ఆతనికి వ్యాసరచనా మూలమున బహుమతియు, విద్యార్థి వేతనమును లభించెను; కేంబ్రిడ్జి విద్యార్థి సంఘమునకు ఆతడు అధ్యక్షుడుగా ఎన్నిక ఆయెను; మరియు బర్కు యొక్క రాజకీయ అభిప్రాయముల పై అతడు వ్రాసిన బహుమతి వ్యాసము పండితుల మన్ననలను పొందెను. గణితశాస్త్రమున పట్టభద్రుడయ్యు ఆర్థిక, వేదాంత శాస్త్ర ములలో అతడు చేసిన విశేషకృషి అతనిని ఆచార్యులయిన సిడ్జినిక్, వైట్ హెడ్, ఆల్ఫ్రెడ్ మార్షలు వంటి విజ్ఞాన వేత్తల ప్రాబల్యమునకు గురిచేసెను. ఇండియా ఆఫీసులో ఉన్నతోద్యోగము సంపాదించుకొని ప్రభుత్వోద్యోగము వందే స్థిరపడదలచిన కీన్సుదృష్టిని ఎటులైన కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయము దెస మరలింపవలయునని మార్షలు యొక్క సంకల్పము; దీని ఫలితముగా కొంతకాలము కేంబ్రిడ్జిలో కీన్సు, ద్రవ్య సిద్ధాంతవిషయమున ఉపన్యాసకుడుగా పని చేసెను. అర్థశాస్త్రమునందలి ద్రవ్య సిద్ధాంతమును శోధించు టలో అతడు నిర్వహించిన పాత్ర యొక్క ప్రాముఖ్యము గురుతరమైనది. క్రీ. శ. 1913 లో ఆతడు "ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్సు" అను గ్రంథమును రచించెను. మరియు 'ఇండియా ఆఫీసు'లో నుండగా భారతీయ ద్రవ్యవిషయములలో ఆతడు చూపిన శ్రద్ధ కారణముగా ఆతడు 1913-14 సంవత్సరములలో భారతీయ ద్రవ్య మును పరీక్షించుటకు ప్రభుత్వముచే ఏర్పాటు చేయ బడిన సంఘములో సభ్యుడుగా నియుక్తుడై పనిచేసెను. 1915 నుండి 1919 వరకు బ్రిటిష్ ట్రెజరీలో అధికారిగా నుండెను. తదుపరి రీడింగు ప్రభువుతో ఆర్థిక సమా లోచనలకై అమెరికా సంయుక్త రాష్ట్రముల కేగెను. మొదటి ప్రపంచయుద్ధము ముగిసిన తర్వాత పారిస్ శాంతి సమావేశములో బ్రిటిష్ జరీ అభ్యర్థిగా ఆతడు చూపిన అర్థశాస్త్ర విజ్ఞానము శ్లాఘనీయమైనది. యుద్ధా నంతరము జర్మను ప్రభుత్వము మిశ్రమండలికి చెల్లించవలసి నదిగా నిర్ణయింపబడిన పరిహారముల సమస్యవిషయమై ఆతడవలంబించిన వైఖరి వివాదగ్రస్తమైన దయ్యును ఆతని దూరదృష్టినే రుజువు చేసినది. 1919 లో ఆతడు
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/787
ఈ పుటను అచ్చుదిద్దలేదు