విజ్ఞానకోశము - - మును గొనుడనెనట! వేంకటాచార్యుల వారు అదీ గాంచి- "మత పరిపాట్యా వాట్యా వీట్యాదానం విధీయతాం స్వైరం విద్యా పరిపాట్యా పితు నిటలాక్ష స్యాపి నఘటతే వీటి"— అనుచు తాంబూలమును గొనిరట ! వేంకటాచార్యుల వారు ఈ యాస్థానమున 12 సంవత్స రములు వరుసగా వచ్చిన పండితుల నందర నోడించి తాంబూలము గొనిరట! వేంకటాచార్యులపై కోపము వహించిన పూనా పండితులు కాశీనుండి 40 సంవత్సరములు కేవలము ఒక్క న్యాయశాస్త్ర వ్యాసంగ మొనర్చిన పురుషోత్తమశాస్త్రి యను పండితుని వేంకటాచార్యుల నెదుర్కొనుటకు రప్పించినట! పురుషోత్తమశాస్త్రిగారు వచ్చులోపల జనార్దన భట్టాచార్యుల మనుమ తిరువురును ఆచార్యులవారి గదాధరీయ ఖండన మను నామాంతరము గల " ఝంఝామారుతము"ను ఖండింపవచ్చి పరాభూతులై పోయిరట ! పురుషోత్తమశాస్త్రి గదాధర భట్టాచార్యుల మనుమడట. అత డొంటికంటివాడట. పురుషో త్తమశాస్త్రి గారిని చూచి వేంకటాచార్యుల వారు — ఆఖండల స్సహస్రాతః విరూపాక్ష స్త్రిలోచనః అన్వే ద్విలోచనా స్సర్వే కో భవా నేకలోచనః” యని వేళాకోళము చేసిరట! పురుషోత్తమశాస్త్రిగారు 18 దినములు వాక్యార్థము చేసి ఆచార్యులవారి నోడింప జూలక బగళాప్రయోగ మొనర్చిరట! ఆచార్యుల వారు హయగ్రీవ దండకమును చెప్పి తమ్ము రక్షించుకొనిరట ! పురుషో త్తమశాస్త్రిగారు చనిపోయిరట! వేంకటాచార్యులవా రొకప్పుడు తిరుపతికి పోయిరట. వీరు పోవుసరికి స్వామివారి గుడితలుపులు మూయబడె కిస్సు. జె. యం. నట. అప్పు డాచార్యులవారు, స్వామివారి నీ రీతిగా నుపాలంభించిరట "ఐశ్వర్య మద మత్తోసి మాం నజానాని కేశవ పరైః పరిభవే ప్రాప్తే మ దధీనా తవ స్థితిః" - ఇట్టి శ్లోకములే ఉదయనాచార్యుల (9 వ శతాబ్ది) పేరు తోడను, వేదాంత దేశికుల పేరుతోడను ప్రచారమం దున్నవి. వేంకటాచార్యుల వారి సంస్కృత గ్రంథములు : 1. ఝంఝామారుతమ్ - ఇది గదాధరీయఖండనము. ఈ .. 2. గజసూత్రవాదమ్ ఇది యొక వ్యాకరణ గ్రంథము. “ణేరణే” అను సూత్రార్థమును ప్రపంచించునట్టిది. గ్రంథాంతమున. " ణేరణావితి సూత్రార్థం భగవాన్ వేదపాణినిః అహం చ భాష్యకారస్తు త త్త్వతో నేత్తివా నవా" యని కలదు. కాని ఇట్టి శ్లోకమే భట్టోజీ పేరుతో కూడ ప్రచారమం దున్నది. 8. శృంగార తరంగిణీ, 4. అలంకార కౌస్తుభమ్, 5. రసికజన మానసోల్లాస భాణమ్, 6. శుకాభిపతన నాటకమ్, 7. ఉషాపరిణయ నాటకమ్, 8. యతిరాజ దండకమ్, 9. హయగ్రీవ దండకమ్, 10. దశావతార స్తోత్రం, 11. భావశతకమ్ మొదలగునవి. ఇందులో కడపటి మూడు మాత్రమే ముద్రితములు. ఇవికాక 'అచలాత్మజాపరిణయ' మను ద్వ్యర్థికావ్యము నాంధ్రములో వ్రాసిరి. ఇది ఏలూరు మంజువాణి ప్రెస్ లో ముద్రితము. బి. రా. కీన్సు. జె. యం. (జాన్ మేనార్డు కీన్సు) : సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతమునకు ప్రథమ ప్రపంచ సంగ్రామమువలన పెద్ద దెబ్బయే తగిలినది. అంతర్జాతీయ 733 వాణిజ్యము ఛిన్నాభిన్నమై, చరిత్రలో ఇంతకు ముందెన్నడు ఎరుగనంత ఎక్కువగా ప్రభుత్వము ప్రయి వేటు ఆర్థిక రంగముపై అజమాయిషీ చేయుట తటస్థించెను.
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/786
ఈ పుటను అచ్చుదిద్దలేదు